Zombie Reddy 2: టాలీవుడ్‌లో సరికొత్త జోనర్‌ను పరిచయం చేస్తూ బ్లాక్‌బస్టర్ విజయం సాధించిన జాంబీ రెడ్డి చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న జాంబీ రెడ్డి 2: నెక్ట్స్‌ లెవెల్ - డెడ్ ఆర్ అలైవ్ నుంచి అదిరిపోయే అప్‌డేట్ వచ్చేసింది. కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర పుట్టినరోజును పురస్కరించుకుని చిత్ర బృందం ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది. ఊహించని రీతిలో ఉన్న ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తోంది.

వైల్డ్ - ఫియర్స్ అవతార్‌లో ఉపేంద్ర

సాధారణంగానే విలక్షణమైన పాత్రలతో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచే ఉపేంద్ర, ఈ సినిమాలో మునుపెన్నడూ చూడని అత్యంత రగ్గడ్, వైల్డ్ లుక్‌లో దర్శనమిచ్చారు.

పోస్టర్‌లో ఉపేంద్ర భారీ వృక్షం కొమ్మకు తలకిందులుగా వేలాడుతూ, చేతిలో పొడవైన పదునైన ఆయుధం పట్టుకుని కనిపించిన తీరు ఒళ్లు గగుర్పొడిచేలా ఉంది. పొడవాటి జుట్టు, రఫ్ గడ్డం, తీక్షణమైన చూపులతో పాటు గిరిజన తరహా డిజైన్లతో కూడిన డార్క్ కాస్ట్యూమ్ ఆయన పాత్రపై భారీ అంచనాలు పెంచుతోంది. దట్టమైన అడవి, మండుతున్న కాగడాల బ్యాక్‌డ్రాప్‌తో రూపొందించిన ఈ పోస్టర్‌కు *రెడీ టు టర్న్ ది వరల్డ్ అప్‌సైడ్ డౌన్ అనే క్యాప్షన్ మరింత హైప్ తీసుకొచ్చింది.

-భారీ కాస్టింగ్.. గ్లోబల్ రిలీజ్

తేజ సజ్జా ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ షానయా కపూర్ కథానాయికగా టాలీవుడ్‌కు పరిచయం అవుతోంది. మొదటి భాగానికి దర్శకత్వం వహించిన ప్రశాంత్ వర్మ ఈ సీక్వెల్‌కు క్రియేటర్‌గా వ్యవహరిస్తుండగా, సుపర్ణ్ ఎస్. వర్మ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టి.జి. విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ హై-వోల్టేజ్ ఫాంటసీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీతో పాటు నేపాలీ, జపనీస్ భాషల్లో అంతర్జాతీయ స్థాయిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. జాంబీ వరల్డ్‌కు ఉపేంద్ర లాంటి అద్భుతమైన నటుడు తోడవడంతో జాంబీ రెడ్డి 2పై దేశవ్యాప్తంగా సినీ ప్రియుల్లో భారీ క్రేజ్ నెలకొంది.

Next Story