Ontimitta Sri Kodandarama Swamy Temple: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి అన్నప్రసాదానికి రూ.10.01 లక్షల విరాళం
అన్నప్రసాదానికి రూ.10.01 లక్షల విరాళం

Ontimitta Sri Kodandarama Swamy Temple: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో భక్తులకు అన్నప్రసాద వితరణ నిర్వహణ కోసం టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ నన్నపనేని సదాశివరావు రూ.10,01,116 విరాళంగా అందజేశారు.
ఈ మేరకు శనివారం తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో టిటిడిబోర్డు సభ్యులు శ్రీ నన్నపనేని సదాశివరావు తన సతీమణితో కలిసి కలిసి విరాళానికి సంబంధించిన డీడీని కార్యనిర్వహణాధికారి శ్రీ ముద్దాడ రవిచంద్రకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఒంటిమిట్ట ఉప కార్యనిర్వహణాధికారి శ్రీమతి ఎ. ప్రశాంతి పాల్గొన్నారు.
హైదరాబాద్ కు చెందిన శ్రీనివాస సప్లై చైన్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ శుక్రవారం టీటీడీ శ్రీ వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళంగా అందించింది.
అదేవిధంగా హైదరాబాద్ కు చెందిన శ్రీ ధర్మ తేజ అనే భక్తుడు టీటీడీ బర్డ్ ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళంగా అందించారు. ఈ మేరకు దాతల తరఫున టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ నన్నపనేని సదాశివరావు తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడుకు విరాళం డీడీలను అందజేశారు.

