Chandraprabha Vahana Seva: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం సాయంత్రం నిర్వహించిన చంద్రప్రభ వాహనసేవలో 8 రాష్ట్రాలకు చెందిన 17 కళాబృందాల నుంచి 453 మంది కళాకారులు నృత్యగానాలతో స్వామివారికి భక్తిపూర్వక కళాసేవ సమర్పించారు.

సంప్రదాయ కళలు.. ఆధ్యాత్మిక వైభవం

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, మిజోరం, మేఘాలయ, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, త్రిపుర రాష్ట్రాల కళాకారులు భరతనాట్యం, సంగ్రైన్, వంగల, గోపికా, దీప నృత్యాలు, కోలాటం తదితర సంప్రదాయ కళారూపాలతో భక్తులను అలరించారు.

శ్రీకృష్ణ లీలలు, రామాయణం, అష్టలక్ష్మీ వైభవం, శ్రీనివాస వైభవం, శ్రీకృష్ణ తులసీ వివాహం వంటి ఆధ్యాత్మిక ఇతివృత్తాలను కళారూపాల్లో ప్రదర్శించి భారతీయ సంస్కృతి, సనాతన ధర్మ వైభవాన్ని చాటారు.

చంద్రప్రభ వాహనంపై విహరించిన శ్రీ మలయప్పస్వామివారికి వివిధ రాష్ట్రాల కళాకారులు సమర్పించిన కళాసేవ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది

Next Story