Adhika Jyeshtha Masam 2026: అధిక జ్యేష్ఠ మాసం 2026: ఈ నెల రోజులు ఏం చేయాలి? ఏం చేయకూడదు?
ఈ నెల రోజులు ఏం చేయాలి? ఏం చేయకూడదు?

Adhika Jyeshtha Masam 2026: హిందూ ధర్మశాస్త్రం ప్రకారం కాలగణనలో అధిక మాసానికి అత్యంత విశిష్టమైన స్థానం ఉంది. సూర్య, చంద్ర గమనాల ఆధారంగా ఏర్పడే ఈ అధిక మాసాన్ని ‘పురుషోత్తమ మాసం’ అని కూడా పిలుస్తారు. ఈ ఏడాది 2026 మే 17వ తేదీ నుంచి పవిత్రమైన "అధిక జ్యేష్ఠ మాసం ప్రారంభం అయ్యింది
సాధారణంగా అధిక మాసంలో ఎలాంటి శుభకార్యాలు చేయకూడదని పండితులు చెబుతుంటారు. అయితే, లౌకిక సుఖాల కంటే ఆధ్యాత్మిక పురోభివృద్ధికి, దైవచింతనకు ఈ మాసం ఒక వరం లాంటిదని పురాణాలు చెబుతున్నాయి. ఈ పవిత్ర కాలంలో మనం చేసే చిన్న దైవకార్యమైనా సరే.. అనంతమైన పుణ్యఫలాన్ని ఇస్తుంది.
అధిక జ్యేష్ఠ మాసంలో ఏం చేయాలి?
ఈ నెల రోజుల పాటు శ్రీమహావిష్ణువును, లక్ష్మీదేవిని పూజించడం అత్యంత శ్రేష్ఠం. ప్రతిరోజూ ఉదయాన్నే తలస్నానం చేసి దీపారాధన చేయాలి. విష్ణుసహస్రనామ పారాయణ, పురుషోత్తమ మాస వ్రతం, భాగవత శ్రవణం చేయడం వల్ల జాతకంలోని దోషాలన్నీ తొలగిపోతాయి. అలాగే ఈ మాసంలో దానధర్మాలకు విశేష ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా కాంస్య పాత్రలో (కంచు గిన్నెలో) ముప్పై మూడు అప్పాలు పెట్టి దానం చేయడం వల్ల పితృదోషాలు తొలగిపోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి.
ఏం చేయకూడదు.?
అధిక మాసం అనేది కేవలం దైవచింతనకు కేటాయించిన సమయం. కాబట్టి ఈ కాలంలో ఎలాంటి కామ్య కర్మలు అంటే స్వార్థ ప్రయోజనాల కోసం చేసే పనులు చేయకూడదు. ముఖ్యంగా వివాహాలు, ఉపనయనాలు, గృహప్రవేశాలు, నూతన వ్యాపారాల ప్రారంభం, ఆస్తుల కొనుగోలు వంటి శుభకార్యాలను పూర్తిగా నిషిద్ధంగా భావిస్తారు. అలాగే తామసిక ఆహారానికి, దురలవాట్లకు, కోపతాపాలకు ఈ సమయంలో దూరంగా ఉండాలి.

