Amarnath Yatra 2026: పవిత్ర అమర్‌నాథ్ యాత్ర అధికారికంగా ప్రారంభం కావడంతో దేశవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు జమ్మూ కాశ్మీర్‌లోని మంచు లింగ దర్శనానికి తరలివస్తున్నారు. అయితే భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని అమర్‌నాథ్ శ్రైన్ బోర్డు, స్థానిక యంత్రాంగం అత్యంత కఠినమైన మార్గదర్శకాలను జారీ చేశాయి. భక్తుల రద్దీని నియంత్రించడానికి మరియు హిమాలయాల్లో సురక్షితమైన ప్రయాణాన్ని అందించడానికి ఈసారి నిబంధనలను మరింత కఠినతరం చేశారు.

ప్రధాన నిబంధనలు - మార్గదర్శకాలు

ముందస్తు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి:

మొదటి ప్రాధాన్యత యాత్రకు వెళ్లే ప్రతి ఒక్కరూ ముందే ఆన్‌లైన్‌లో లేదా నిర్దేశిత బ్యాంక్ శాఖల ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవడం తప్పనిసరి. రిజిస్ట్రేషన్ లేకుండా నేరుగా జమ్మూ కాశ్మీర్ చేరుకుంటే యాత్రకు అనుమతించరు.

నిగదిత తేదీల్లోనే ప్రయాణం:

మీకు కేటాయించిన తేదీన మాత్రమే యాత్రను ప్రారంభించాలి. ఉదాహరణకు, మీకు జూలై 20న అనుమతి ఉంటే, మీరు జూలై 18 లేదా 19నే అక్కడికి చేరుకున్నా ముందే వెళ్లడానికి అనుమతించరు.

పరిమిత సంఖ్యలోనే భక్తులకు అవకాశం:

సుప్రీం కోర్ట్ ఆదేశాలు.

హిమాలయాల్లోని కఠిన వాతావరణం, ఇరుకైన దారుల దృష్ట్యా సుప్రీం కోర్ట్ ఆదేశాల ప్రకారం రోజుకు పరిమిత సంఖ్యలో భక్తులను మాత్రమే కొండపైకి అనుమతిస్తారు.

తత్కాల్ రిజిస్ట్రేషన్‌పై ఆధారపడవద్దు:

ముఖ్య గమనిక.

నేరుగా అక్కడికి వెళ్లి తత్కాల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అనే ఆలోచనతో వెళ్లడం సరికాదు. ఈసారి ఆన్-సైట్ కోటా చాలా పరిమితంగా ఉంది, కాబట్టి ముందస్తు ప్లానింగ్ అవసరం.

యాజమాన్యం విజ్ఞప్తి:

ముందస్తు రిజిస్ట్రేషన్ లేకుండా రావడం, కేటాయించిన తేదీ కంటే ముందే యాత్రకు ప్రయత్నించడం వల్ల అక్కడ ఏర్పాట్లపై తీవ్ర ఒత్తిడి పెరుగుతోంది. కాబట్టి భక్తులంతా భద్రతా సిబ్బందికి, బోర్డు నియమాలకు సహకరించాలని అధికారులు కోరుతున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story