ఉత్తర్వులు జారీ చేసిన ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్

మంగళగిరికి చెందిన అందె వెంకటేశ్వరావు ను టీటీడీ చీఫ్ ఆడిట్ అధికారిగా నియమితులయ్యారు. ఈ మేరకు ప్రిన్సిపల్ సెక్రటరీ పీయూష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. పేద చేనేత కార్మిక కుటుంబంలో జన్మించిన వెంకటేశ్వరరావు చిన్నతనం నుంచి మగ్గం నేస్తూ ఉన్నత విద్యను అభ్యసించారు. తన ప్రతిభతో 1996లో గ్రూప్ -1 సాధించారు. స్టేట్ ఆడిట్ డిపార్ట్ మెంట్ లో జాయింట్ డైరెక్టర్ హోదాలో ఉన్న ఆయనను ప్రభుత్వం టీటీడీ చీఫ్ ఆడిట్ ఆఫీసర్ గా నియమిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. అందె వెంకటేశ్వరావు ను టీటీడీ చీఫ్ ఆడిట్ అధికారిగా నియమించడం పట్ల నగరానికి చెందిన పలువురు ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.

Updated On 4 July 2025 9:51 AM IST
Politent News Web 1

Politent News Web 1

Next Story