Applying Tilak on Children’s Forehead: పిల్లల నుదుట తిలకం దిద్దుతున్నారా? జ్ఞాపకశక్తి పెరగడమే కాదు.. ఆ చక్రం కూడా మేల్కొంటుంది..
ఆ చక్రం కూడా మేల్కొంటుంది..

Applying Tilak on Children’s Forehead: మన హిందూ సంప్రదాయంలో స్నానం చేసిన తర్వాత నుదుటిపై విభూతి, కుంకుమ లేదా గంధం ధరించడం అనేది అనాదిగా వస్తున్న ఆచారం. అయితే ఇది కేవలం ఒక మతపరమైన ఆచారం మాత్రమే కాదు, దీని వెనుక అద్భుతమైన ఆరోగ్య, మానసిక ప్రయోజనాలు ఉన్నాయని ఆధ్యాత్మిక గురువులు మరియు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ముఖ్యంగా పిల్లల విషయంలో ఈ నియమం పాటించడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయని నిపుణులు వివరిస్తున్నారు.
ఆజ్ఞా చక్రం - జ్ఞాపకశక్తికి మూలం
మానవ శరీరంలో కనుబొమ్మల మధ్య భాగంలో ఆజ్ఞా చక్రం అనే శక్తి కేంద్రం ఉంటుంది. పిల్లలకు ఆ ప్రదేశంలో విభూతి లేదా కుంకుమ పెట్టడం వల్ల ఆజ్ఞా చక్రం ఉత్తేజితం అవుతుంది. దీనివల్ల వారిలో ఏకాగ్రత, జ్ఞాపకశక్తి గణనీయంగా పెరుగుతాయి. ఓర్పు, సహనం పెంపొందుతాయి. నేటి కాలంలో పిల్లలు ఎదుర్కొంటున్న కోపం, చిరాకు వంటి సమస్యలను తగ్గించడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.
మొబైల్ అలవాటుకు చెక్
ప్రస్తుత రోజుల్లో పిల్లలు మొబైల్ ఫోన్లకు బానిసలై చదువులో వెనుకబడుతున్నారు. ఉదయం 10 గంటల లోపు పిల్లలకు తిలకం దిద్ది, దైవ ప్రార్థన అలవాటు చేయడం వల్ల వారి దృష్టి మొబైల్స్ నుండి మళ్ళి, సానుకూల ఆలోచనల వైపు మళ్లుతుంది.
ఏ పదార్థం పెడితే ఎలాంటి ఫలితం?
తిలకం కోసం ఉపయోగించే ప్రతి పదార్థానికి ఒక ప్రత్యేక గుణం ఉంది. ఇది నుదుటి భాగాన్ని చల్లబరుస్తుంది. నాడీ వ్యవస్థను బలపరిచి పిల్లల ముఖం ఆకర్షణీయంగా, ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది.
విభూతి: ఇది చర్మంపై ఉన్న అదనపు తేమను గ్రహిస్తుంది. చర్మ వ్యాధుల నుండి రక్షణ ఇవ్వడమే కాకుండా శరీరానికి బలాన్ని చేకూరుస్తుంది.
కుంకుమ:
పసుపు, నిమ్మకాయలతో సహజంగా తయారైన కుంకుమ ధరించడం వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుంది. ఇది రక్త ప్రసరణను క్రమబద్ధీకరించి ఆలోచనా శక్తిని పెంచుతుంది.
తల్లి పాత్ర - ఇంటికి శుభం
ఇల్లు ఒక దేవాలయమని, తల్లి ఆ ఇంటి దేవత అని మన సంస్కృతి చెబుతోంది. తల్లి పవిత్రమైన చిహ్నాలను ధరించి, తన చేతులతో పిల్లలకు తిలకం దిద్దినప్పుడు ఆ ఇంట్లో శుభప్రదమైన వాతావరణం ఏర్పడుతుంది. ఇది పిల్లలలో వినయాన్ని, క్రమశిక్షణను పెంపొందిస్తుంది.

