పండుగలు జరుపుకుంటారా.?

Festivals Celebrated Based on Tithi: హిందూ ధర్మశాస్త్రం,భారతీయ కాలగణన ప్రకారం 'ఉదయ తిథి' (Sunrise Tithi) కి అత్యంత ప్రాముఖ్యత ఉంది. తిథి అనేది చంద్రుని గమనంపై ఆధారపడి ఉంటుంది కాబట్టి, అది రోజులో ఏ సమయంలోనైనా ప్రారంభమై, ఏ సమయంలోనైనా ముగియవచ్చు. కానీ మన శాస్త్రాలు పండుగలను నిర్ణయించేటప్పుడు సూర్యోదయాన్ని ప్రామాణికంగా తీసుకుంటాయి.

1. సూర్యుడే కాలానికి ఆధారం

సనాతన ధర్మంలో సూర్యుడిని 'లోక బాంధవుడు' కాల స్వరూపుడు' అని పిలుస్తారు. సూర్యోదయంతోనే ఒక కొత్త రోజు ప్రారంభమవుతుందని మన నమ్మకం. సూర్యోదయం సమయంలో ఏ తిథి అయితే ఉంటుందో, ఆ రోజంతా అదే తిథిగా పరిగణించడం ఒక సంప్రదాయం.

2. 'సాత్విక' శక్తి ప్రారంభం

సూర్యోదయ సమయం అత్యంత పవిత్రమైనది (బ్రాహ్మీ ముహూర్తం తర్వాత వచ్చేది). ఆ సమయంలో ప్రకృతిలో సాత్విక శక్తి ఎక్కువగా ఉంటుంది. ఆ పవిత్ర సమయంలో ఉన్న తిథి ప్రభావం ఆ రోజంతా ఉంటుందని భావిస్తారు. అందుకే జపాలు, హోమాలు, వ్రతాలు ఉదయ తిథి ఉన్నప్పుడే మొదలుపెడతారు.

3. గందరగోళం లేకుండా ఉండటానికి

తిథులు గంటల లెక్కన మారుతుంటాయి (ఉదాహరణకు: ఒక తిథి మధ్యాహ్నం 2 గంటలకు ముగిసి, మరో తిథి మొదలవ్వచ్చు). ఒకవేళ గంటల ప్రకారం పండుగలు జరుపుకుంటే, ఒకే రోజులో రెండు పండుగలు లేదా సగం రోజు ఒక పండుగ, సగం రోజు మరొకటి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ గందరగోళం లేకుండా "సూర్యోదయానికి ఏ తిథి ఉందో అదే ఆ రోజు తిథి" అనే నియమాన్ని (ఉదయ తిథి) పాటిస్తారు.

అన్ని పండుగలకు ఇదే వర్తించదు!

శాస్త్రం ప్రకారం కొన్ని పండుగలకు 'నిశిత కాలం' (అర్ధరాత్రి) లేదా 'ప్రదోష కాలం' (సాయంత్రం) ముఖ్యం.

శివరాత్రి: దీనికి అర్ధరాత్రి చతుర్దశి ఉండాలి. కాబట్టి సూర్యోదయంతో సంబంధం లేకుండా అర్ధరాత్రి తిథిని చూస్తారు.

దీపావళి: లక్ష్మీ పూజ కోసం సాయంత్రం (ప్రదోష కాలం) అమావాస్య ఉండాలి.

హోలీ (కామ దహనం): దీనికి కూడా రాత్రి సమయం పౌర్ణమి ఉండటం ముఖ్యం.

గమనిక : సాధారణంగా దానాలు, వ్రతాలు, పారాయణలకు ఉదయ తిథి ప్రధానం. కానీ కొన్ని ప్రత్యేక దేవతా పూజలకు ఆయా దేవుళ్లు ఆవిర్భవించిన లేదా పూజించాల్సిన సమయానికి (Specific Time) ఉన్న తిథిని ప్రామాణికంగా తీసుకుంటారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story