Ashadha Gupta Navratri 2026: హిందూ సంప్రదాయంలో నవరాత్రులకు ఎంతో విశిష్ట స్థానం ఉంది. సాధారణంగా మనకు శరన్నవరాత్రులు, వసంత నవరాత్రులు మాత్రమే తెలుసు. కానీ, సాధకులకు, అమ్మవారి అనుగ్రహం కోరుకునే భక్తులకు అత్యంత శక్తివంతమైనవి ఆషాఢ మాసంలో వచ్చే "ఆషాఢ గుప్త నవరాత్రులు". ఈ నవరాత్రులు లలితా త్రిపురసుందరి దేవి సైన్యాధిపతి అయిన 'శ్రీ వారాహి దేవి' ఆరాధనకు అత్యంత ప్రశస్తమైనవి.ఈ ఏడాది 2026 లో, ఈ పవిత్రమైన వారాహి దేవి నవరాత్రులు జూలై 15 బుధవారం నుంచి జూలై 23 గురువారం వరకు తొమ్మిది రోజుల పాటు జరగనున్నాయి.

అమ్మవారిని ఎందుకు పూజించాలి?

వారాహి అమ్మవారు జ్ఞానానికి, విజయానికి మరియు రక్షణకు అధిదేవత. మన జీవితంలో ఉన్న ఆర్థిక ఇబ్బందులు, శతృ బాధలు, కోర్టు సమస్యలు మరియు మనశ్శాంతి లేకపోవడం వంటి నెగటివ్ ఎనర్జీలను తొలగించడంలో వారాహి దేవిని మించిన శక్తి లేదు. అందుకే ఈ తొమ్మిది రోజులు అమ్మవారిని నిష్ఠతో కొలిస్తే ఎలాంటి ఆపదలైనా తొలగిపోతాయని నమ్ముతారు.

ఎలా పూజించాలి? ఏ సమయంలో పూజించాలి?

గుప్త నవరాత్రులలో పూజను చాలా రహస్యంగా, ఏకాంతంగా చేయడం విశేషం. ఉదయం లేదా ముఖ్యంగా రాత్రి 8 గంటల తర్వాత చేసే పూజకు అత్యంత శక్తులు ఉంటాయి.

ఈ తొమ్మిది రోజులు ఉదయాన్నే ఇల్లు శుభ్రం చేసుకుని, వారాహి దేవి చిత్రం లేదా యంత్రాన్ని తూర్పు ముఖంగా ఉంచాలి. అమ్మవారికి ఇష్టమైన ఎర్రటి పువ్వులు, ముఖ్యంగా మందార పూలతో అలంకరించాలి. ఐదు వత్తుల దీపాన్ని వెలిగించి, అమ్మవారి మూలమంత్రాన్ని గానీ, అష్టోత్తరాన్ని గానీ పఠించాలి.వారాహి అమ్మవారికి నైవేద్యం చాలా ముఖ్యం. అమ్మవారికీ ఇష్టమైన దానిమ్మ పండ్లు, చక్కెర పొంగలి, మరియు ముఖ్యంగా వెల్లుల్లి లేని పులిహోర లేదా ఉడకబెట్టిన శనగలను నివేదించాలి.

ఎలాంటి ఫలితాలు కలుగుతాయి?

ఈ తొమ్మిది రోజులు ఎవరైతే లక్ష్మీ వారాహిని భక్తితో అర్చిస్తారో.. వారి ఇంట ధనధాన్య వృద్ధి కలుగుతుంది. వ్యాపారంలో నష్టాలు తొలగి లాభాలు వస్తాయి. ముఖ్యంగా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడేవారికి ఉపశమనం లభిస్తుంది. అపమృత్యు భయాలు తొలగి, సర్వకార్య సిద్ధి లభిస్తుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story