Astrology: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నవగ్రహాల సంచారం, నక్షత్ర మార్పులు మానవ జీవితాలపైనా, దేశ ఆర్థిక పరిస్థితులపైనా ప్రభావం చూపుతాయని నమ్ముతారు. దాదాపు 400 సంవత్సరాల తర్వాత మఖ నక్షత్రంలో కుజుడు, కేతువు, గురుడు ఒకే సమయంలో కలుసుకోవడం అత్యంత అరుదైన యోగంగా పండితులు భావిస్తున్నారు. ఈ త్రిగ్రహ కూటమి వల్ల ఐదు రాశుల వారికి ఊహించని ధనలాభం, కెరీర్‌లో ఉన్నత శిఖరాలు అధిరోహించే అవకాశాలు లభిస్తాయని చెబుతున్నారు.

కుజుడు ధైర్యం, శక్తి, నాయకత్వం, పట్టుదలకు కారకుడు. కేతువు ఆధ్యాత్మికత, వైరాగ్యం, లోతైన పరిశోధనలకు సంబంధించినది. గురుడు జ్ఞానం, ధర్మం, సంతానం, సంపదకు కారకుడు. ఈ మూడు గ్రహాలు ఒకే నక్షత్రంలో కలవడం వల్ల ధైర్యం, ఐశ్వర్యం, ఆధ్యాత్మిక బలం కలిసి వస్తాయి.

గ్రహ సంచార వివరాలు ఇలా ఉన్నాయి. కుజుడు మఖ నక్షత్రంలో నవంబర్ 12 నుంచి డిసెంబర్ 19 వరకు ఉంటాడు. కేతువు మార్చి 29 నుంచి డిసెంబర్ 5 వరకు మఖలో సంచరిస్తాడు. గురుడు అక్టోబర్ 31న మఖలోకి ప్రవేశించి 2027 జనవరి 24 వరకు అక్కడే ఉంటాడు. ఈ కాలంలో ఐదు రాశుల వారికి ప్రత్యేక ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్యులు వివరిస్తున్నారు.

మేష రాశి వారికి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్ లేదా వేతనం పెరిగే అవకాశాలు ఉన్నాయి. విదేశాల్లో స్థిరపడే యోగం కనిపిస్తోంది. కొద్ది ప్రయత్నంతో అధిక లాభం పొందవచ్చు. సమాజంలో ప్రముఖులతో సంబంధాలు ఏర్పడతాయి. నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది. పెళ్లి విషయంలో ఉన్నత కుటుంబంతో సంబంధం కుదురుతుంది. పుణ్యక్షేత్రాలు లేదా ఆధ్యాత్మిక యాత్రలు చేసే సూచనలు ఉన్నాయి.

వృషభ రాశి వారు కొత్త వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. గత పెట్టుబడుల నుంచి అధిక లాభాలు వస్తాయి. తీసుకునే నిర్ణయాలు విజయవంతమవుతాయి. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. ఉద్యోగంలో జీతభత్యాలు పెరగడంతో పాటు అదనపు ఆదాయం కలుగుతుంది. చేతి వృత్తుల వారికి ఆర్డర్లు ఎక్కువగా వస్తాయి. సంతాన యోగం కనిపిస్తోంది. ప్రేమ, పెళ్లి వ్యవహారాలు కలిసి వస్తాయి.

తులా రాశి వారికి గ్రహబలం పెరుగుతుంది. విదేశాల్లో స్థిరపడే అవకాశం ఉంది. ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరుగుతుంది. ఉద్యోగంలో ఉన్నత పదవులు లభిస్తాయి. వ్యాపారాల్లో లాభాలు అంచనాలను మించే అవకాశం ఉంది. పూర్వీకుల ఆస్తి కలిసి వస్తుంది. పెళ్లి సంబంధాలు కుదురుతాయి. ఆరోగ్యం బాగుంటుందని పండితులు చెబుతున్నారు.

వృశ్చిక రాశి వారికి ఊహించని లాభాలు వస్తాయి. వృత్తి, ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి ఉంటుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. వ్యాపారస్తులు అధిక లాభాలు గడిస్తారు. కొత్త పెట్టుబడులు పెట్టేందుకు అనుకూలం. పెళ్లి, ప్రేమ విషయంలో మొదట్లో అవాంతరాలు ఉన్నా చివరికి కోరుకున్నదే జరుగుతుంది.

కుంభ రాశి వారికి ఎప్పటినుంచో ఆగిపోయిన పాత బకాయిలు చేతికి అందుతాయి. శారీరక శక్తి, ఉత్సాహం పెరుగుతాయి. కార్యాలయంలో గుర్తింపు లభిస్తుంది. సమాజంలో కీర్తి, గౌరవం పెరుగుతాయి. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. ఉద్యోగస్తులకు అధికారుల మద్దతు పుష్కలంగా ఉంటుంది. ప్రమోషన్, వేతనం పెరగడం జరుగుతుంది. వ్యాపారస్తులకు అనుకోకుండా లాభాలు వస్తాయి.

ఈ అరుదైన త్రిగ్రహ కూటమి వల్ల ధైర్యం, జ్ఞానం, ఆధ్యాత్మిక బలం కలిసి వచ్చి జీవితంలో సానుకూల మార్పులు తెస్తాయని జ్యోతిష్య పండితులు విశ్వసిస్తున్నారు. గ్రహ సంచారం ప్రకారం ఈ ఐదు రాశుల వారు ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తున్నారు. వ్యక్తిగత జాతకం ఆధారంగా నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం.

Next Story