Astrology: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్య భగవానుడు గ్రహాలకు రాజుగా వ్యవహరిస్తాడు. నాయకత్వ లక్షణాలకు ఆధిపత్యం వహించే సూర్యుడు నిర్దిష్ట కాల వ్యవధిలో తన రాశులను, నక్షత్రాలను మారుస్తుంటాడు. ప్రస్తుతం విశాఖ నక్షత్రంలో సంచరిస్తున్న సూర్యుడు నవంబర్ 19వ తేదీ మధ్యాహ్నం 1:34 గంటల నుంచి డిసెంబర్ 3వ తేదీ వరకు అనురాధ నక్షత్రంలో సంచరించనున్నాడు. ఈ నక్షత్ర మార్పు వల్ల నాలుగు రాశుల వారు నక్క తోక తొక్కినట్టు అదృష్టవంతులవుతారని పండితులు చెబుతున్నారు.సూర్యుడు ఆత్మవిశ్వాసం, కీర్తి ప్రతిష్టలు, అధికారానికి కారకుడు. అనురాధ నక్షత్రం శని అధిపత్యంలో ఉంటుంది. ఈ సంచారం మేష, మిథున, కన్య, మీన రాశుల వారికి ప్రత్యేకంగా శుభ ఫలితాలు ఇస్తుందని జ్యోతిష్యులు వివరిస్తున్నారు. ఆర్థిక లాభాలు, ఉద్యోగ పురోగతి, వ్యాపారాల్లో విజయం వంటివి కలుగుతాయని అంచనా.

మేష రాశి వారికి ఈ సంచారం అన్ని విధాల శుభప్రదం. అనుకున్న పనులు సక్రమంగా పూర్తవుతాయి. వ్యాపారస్తులకు ఊహించని లాభాలు వస్తాయి. పాత బాకీలు వసూలవుతాయి. కెరీర్‌లో సమస్యలు తొలగిపోతాయి. పెళ్లి కోసం ఎదురుచూసేవారికి సంబంధం నిశ్చయమవుతుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఉద్యోగస్తులు ఆఫీసులో ప్రత్యేక పాత్ర పోషిస్తారు. ఉన్నతాధికారులతో చర్చలు సఫలమవుతాయి. ఆర్థిక ఇబ్బందులు ఉండవు.

మిథున రాశి వారి జీవితం అద్భుతంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో కీలక నిర్ణయాలు తీసుకోవడానికి ఈ సమయం అనుకూలం. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. చేపట్టిన పనుల్లో పురోగతి ఉంటుంది. కుటుంబ సభ్యుల మద్దతు పూర్తిగా లభిస్తుంది. వ్యాపారస్తులకు అనుకోని లాభాలు కలుగుతాయి. ఉద్యోగస్తులు కార్యాలయంలో ప్రధాన పాత్ర పోషిస్తారు. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు వస్తాయి. కొత్త వ్యాపారాలు, ప్రాజెక్టులు ప్రారంభించే అవకాశం ఉంది.

కన్య రాశి వారికి స్వర్ణయుగం ప్రారంభమవుతుంది. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు ఏర్పడతాయి. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం లభిస్తుంది. చేతి వృత్తుల వారికి ఆర్డర్లు వస్తాయి. కొత్త పనులు ప్రారంభించేందుకు ఇది మంచి సమయం. ఎంతో కాలంగా వేధిస్తున్న సమస్యలు పరిష్కారమవుతాయి. వ్యాపారస్తులు లాభాల బాటలో పయనిస్తారు. పూర్వీకుల ఆస్తి కలిసి వస్తుంది. కెరీర్‌లో ఉన్నతస్థానం లభిస్తుంది. ప్రమోషన్, వేతనం పెరిగే అవకాశం ఉంది. ప్రేమ, పెళ్లి వ్యవహారాలు కలిసి వస్తాయి.

మీన రాశి వారికి పురోగతికి మార్గాలు తెరుచుకుంటాయి. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. అప్పుల్లో చిక్కుకున్నవారికి ఉపశమనం కలుగుతుంది. పాత బకాయిలు వసూలవుతాయి. అదృష్టం తలుపు తడుతుంది. ఆర్థిక లాభాలు పెరుగుతాయి. ముఖ్యమైన ఆర్థిక అవసరాలు తీరుతాయి. ఉద్యోగంలో జీతభత్యాలు, వ్యాపారాల్లో రాబడి వృద్ధి చెందుతాయి.ఈ సూర్య సంచారం వల్ల నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి. ఆత్మవిశ్వాసంతో పనులు సాగుతాయి. జ్యోతిష్య పండితులు ఈ నాలుగు రాశుల వారు ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తున్నారు. వ్యక్తిగత జాతకం ఆధారంగా నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. సూర్య భగవానుని అనుగ్రహం వల్ల జీవితంలో సానుకూల మార్పులు వస్తాయని భావిస్తున్నారు.

Next Story