August Sky Spectacle: ఈ ఏడాది ఆగస్టు నెల అత్యంత కీలకం కాబోతోంది! ఎందుకంటే, ఈ ఒక్క నెలలోనే శక్తివంతమైన గ్రహాలు తమ రాశులను మారుస్తుండగా... దానికి తోడు ఈ ఏడాది రెండో సూర్య గ్రహణం కూడా ముంచుకొస్తోంది. మరి ఈ ఖగోళ మార్పులు మన రాశులపై ఎలాంటి ప్రభావాన్ని చూపనున్నాయి? ఏ గ్రహం ఎప్పుడు మారుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆగస్టు 1వ తేదీనే... శుక్రుడు కన్యా రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. దీనివల్ల ఫ్యాషన్, డిజైనింగ్, లగ్జరీ రంగాల వారికి,వ్యక్తిగత బంధాలకు ఇది ఎంతో లాభసాటిగా ఉంటుంది.ఇక ఆగస్టు 2న, పరాక్రమానికి ప్రతీక అయిన కుజుడు... మిథున రాశిలోకి అడుగుపెడుతున్నాడు. దీనితో నిరుద్యోగులకు మంచి అవకాశాలు, జాబ్ మారాలనుకునే వారికి సరైన సమయం వచ్చిందని చెప్పవచ్చు. అయితే, కొన్ని రాశుల వారు మాత్రం అనవసర వివాదాలకు దూరంగా ఉండటం చాలా మంచిది.

ఇక అసలు సిసలు హైలైట్... ఆగస్టు 12న ఏర్పడబోయే ఈ ఏడాది రెండవ సూర్యగ్రహణం! అయితే ఒక శుభవార్త ఏంటంటే... ఈ గ్రహణం భారతదేశంలో కనిపించదు. కాబట్టి ఎటువంటి సూతక నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. అయినప్పటికీ, జ్యోతిష్య నిపుణుల ప్రకారం గ్రహణ కాలంలో ఎటువంటి పెద్ద నిర్ణయాలు తీసుకున్నా చాలా అప్రమత్తంగా, సంయమనంతో ఉండటం చాలా ముఖ్యం.

ఈ గ్రహణం ముగిసిన వెంటనే... ఆగస్టు 17న సూర్యుడు తన స్వరాశి అయిన సింహరాశిలోకి ప్రవేశిస్తాడు. దీనివల్ల రాజకీయ నాయకులు, ప్రభుత్వ ఉద్యోగులు, అడ్మినిస్ట్రేషన్ రంగంలో ఉన్నవారికి ఇది స్వర్ణయుగమనే చెప్పాలి! కీర్తి ప్రతిష్టలు మెండుగా పెరుగుతాయి. అయితే, సూర్యుని ప్రభావంతో కోపం, దూకుడు పెరిగే అవకాశం ఉంది కాబట్టి మాటపై సంయమనం అవసరం. చివరగా, ఆగస్టు 22న బుధుడు కూడా సింహరాశిలోకి ప్రవేశించడంతో... మీలో ఆలోచనా విధానం మారుతుంది, కమ్యూనికేషన్ స్కిల్స్ అద్భుతంగా బలపడతాయి.

మొత్తంగా చూస్తే, ఈ ఆగస్టు నెల కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని తెచ్చిపెడితే, మరికొన్ని రాశుల వారు ఆర్థిక విషయాల్లో ఆచితూచి అడుగుపెట్టాలని పండితులు హెచ్చరిస్తున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story