Avoid These Things at Night: ఎన్ని పూజలు చేసినా, ఎంత కష్టపడినా ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నాయా? రాత్రి సమయంలో మనకు తెలియకుండా చేసే కొన్ని చిన్న పొరపాట్లే ఇందుకు కారణం కావచ్చు అంటున్నారు వాస్తు నిపుణులు. రాత్రిపూట ఏ పని చేయడం వల్ల వాస్తు దోషాలు ఏర్పడతాయి, అవేం తెచ్చిపెడతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

చాలామంది రాత్రి భోజనం చేశాక పాత్రలను సింక్‌లోనే వదిలేసి, ఉదయం కడుక్కోవచ్చులే అనుకుంటారు. కానీ, ఇలా వాడిన గిన్నెలు సింక్‌లో ఉంచడం వాస్తు ప్రకారం అసలు మంచిది కాదు. దీనివల్ల రాహు-కేతువుల ప్రభావం పెరిగి, నెగెటివ్ శక్తి ఇంట్లోకి ఆకర్షించబడుతుంది. ఫలితంగా లక్ష్మీదేవి ఆగ్రహించి వెళ్లిపోతుందని, ఆర్థిక సమస్యలు చుట్టుముడతాయని పండితులు హెచ్చరిస్తున్నారు.

ఇక రెండవది రాత్రి పడుకునే ముందు అద్దంలో ముఖం చూసుకోవడం లేదా బెడ్‌రూమ్‌లో మంచానికి ఎదురుగా అద్దం ఉండటం మంచిది కాదు. రాత్రివేళల్లో చెడు శక్తుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి, ఆ సమయంలో అద్దంలో చూసుకుంటే అనవసర భయాలు, మానసిక ఒత్తిడి పెరిగి నిద్రలేమి సమస్యలు వస్తాయి. అందుకే పడకగదిలో అద్దం ఉంటే రాత్రి సమయంలో దానిపై ఒక గుడ్డ కప్పి ఉంచడం మంచిది.

చాలామందికి రాత్రిపూట దాహం వేస్తే తాగుదామని దిండు పక్కనే వాటర్ బాటిల్ పెట్టుకునే అలవాటు ఉంటుంది. వాస్తు శాస్త్రం ప్రకారం నీరు చంచల స్వభావులకు, చంద్రుడికి ప్రతీక. దిండు దగ్గర్లో నీళ్లు ఉంటే మనస్సు నిలకడగా ఉండక, ఆలోచనలు ఎక్కువై గాఢ నిద్రకు భంగం కలుగుతుంది. కాబట్టి నీటి బాటిల్‌ను మంచానికి కొద్దిగా దూరంగా ఉంచడం ఉత్తమం.

అలాగే, బాత్రూమ్‌లో రాత్రిపూట బకెట్ ఖాళీగా ఉంచడం లేదా తడి బట్టలు అలాగే వదిలేయడం వల్ల కూడా వాస్తు దోషాలు ఏర్పడతాయి. ఇది కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై, సానుకూల శక్తిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. కాబట్టి ఈ చిన్న వాస్తు నియమాలను పాటిస్తూ, ప్రశాంతమైన నిద్రతో పాటు సిరిసంపదలను సొంతం చేసుకోండి

PolitEnt Media

PolitEnt Media

Next Story