Bay Leaves: బిర్యానీ ఆకుతో ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ మాయం.. ఇంట్లో ఇలా చేస్తే లక్ష్మీదేవి కటాక్షం ఖాయం..
లక్ష్మీదేవి కటాక్షం ఖాయం..

Bay Leaves: మన వంటింట్లో వంటకాల రుచిని, సువాసనను పెంచడానికి ఉపయోగించే మసాలా దినుసుల్లో బిర్యానీ ఆకు అత్యంత ముఖ్యమైనది. ఇది కేవలం ఆరోగ్యానికి, వంటకాలకే కాదు.. ఆధ్యాత్మికంగా, వాస్తు శాస్త్రం పరంగా కూడా అత్యంత శక్తివంతమైనదిగా పరిగణించబడుతుంది. ఇంట్లో ప్రతికూల శక్తిని తరిమికొట్టి, అనుకూల శక్తిని ధనాకర్షణను పెంచడంలో బిర్యానీ ఆకు విశేషంగా తోడ్పడుతుందని జ్యోతిష్య, వాస్తు నిపుణులు చెబుతున్నారు.
ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని పెంచే బిర్యానీ ఆకు చిట్కాలు..
ఇంట్లో బిర్యానీ ఆకును కాల్చడం
ప్రశాంతత, లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ప్రశాంతమైన వాతావరణంలో ఒకటి లేదా రెండు బిర్యానీ ఆకులను కాల్చి, దాని పొగను ఇల్లంతా వ్యాపించేలా చేయాలి.
ఫలితం:
దీనివల్ల ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తి తొలగిపోవడమే కాకుండా మానసిక ఒత్తిడి తగ్గి ఇంట్లో ప్రశాంతత నెలకొంటుంది. వాస్తు దోషాలు కూడా నశిస్తాయి.
కోరికలు నెరవేరడానికి:
ఎండిన ఒక బిర్యానీ ఆకుపై మీ మనసులోని ముఖ్యమైన కోరికను పెన్నుతో రాయాలి.
ఆ తర్వాత ఆ ఆకును సురక్షితంగా కాల్చి, దాని బూడిదను గాలిలో లేదా ప్రవహించే నీటిలో కలపాలి. ఇలా చేయడం వల్ల ఆశించిన కోరికలు త్వరగా నెరవేరుతాయని నమ్ముతారు.
ఆర్థిక సమస్యల నివారణకు - పర్సులో బిర్యానీ ఆకు..
ఒక శుభ్రమైన బిర్యానీ ఆకుపై లక్ష్మీదేవికి ఇష్టమైన నామాలు లేదా స్వస్తిక్ గుర్తును వేసి, దానిని మీ పర్సులో లేదా లాకర్ లో ఉంచాలి.
ఫలితం:
ఇది అనవసరపు ఖర్చులను తగ్గించి, ధనాకర్షణను పెంచుతుంది. ఆర్థిక ఇబ్బందుల నుండి ఉపశమనం లభిస్తుంది.
ప్రశాంతమైన నిద్ర కోసం
నిద్రలేమి, పీడకలలతో బాధపడేవారు తమ దిండు కింద ఒక బిర్యానీ ఆకును ఉంచుకుని పడుకోవడం వల్ల మంచి నిద్ర పడుతుందని, మానసిక ప్రశాంతత లభిస్తుందని నమ్ముతారు.
శాస్త్రీయ కోణం కూడా ఉంది
బిర్యానీ ఆకును కాల్చినప్పుడు దాని నుండి వచ్చే సువాసనలో ఎలిమిసిన్ , పినెన్, యుగెనాల్ వంటి సమ్మేళనాలు విడుదలవుతాయి. ఇవి గాలిలోని బ్యాక్టీరియాను నశింపజేయడమే కాకుండా మానసిక ఆందోళనను తగ్గించి నాడీ వ్యవస్థను ప్రశాంతపరుస్తాయని శాస్త్రీయ అధ్యయనాలు కూడా వెల్లడిస్తున్నాయి.

