Bedroom Vastu Secrets: చాలామంది శారీరకంగా ఎంత కష్టపడినా.. రాత్రి పూట అస్సలు నిద్ర పట్టదు. దీంతో అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటుంటారు. అయితే, మీ పడకగదిలో వాస్తు ప్రకారం చిన్న చిన్న మార్పులు చేస్తే.. హాయిగా, ప్రశాంతంగా నిద్రపోవచ్చని పండితులు చెబుతున్నారు! అసలు ఆ వాస్తు నియమాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయం.. మంచం ఎప్పుడూ తలుపునకు ఎదురుగా ఉండకూడదు! అలా ఉంటే గదిలోకి వచ్చే నెగెటివ్ ఎనర్జీ నేరుగా మీపై ప్రభావం చూపుతుంది. అంతేకాదు, బెడ్‌రూమ్‌లో నిద్రించేటప్పుడు దిశ చాలా ముఖ్యం. తలను తప్పు దిశలో పెట్టి నిద్రపోవడం వల్ల మానసిక ఆందోళన, నిద్రలేమి వంటి సమస్యలు వస్తాయి.

మరి ఏ దిశలో తలపెట్టి పడుకోవాలి?

తూర్పు వైపు తలపెట్టి పడుకుంటే జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుతాయి. విద్యార్థులకు ఇది చాలా మంచిది.

ఎట్టి పరిస్థితుల్లోనూ ఉత్తరం వైపు తలపెట్టి అస్సలు నిద్రపోకూడదు. ఇది ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది.

ఇక దక్షిణ దిశ వైపు తలపెట్టి, ఉత్తరం వైపు కాళ్లు చాపి నిద్రించడం ఆరోగ్యానికి, ఐశ్వర్యానికి, ప్రశాంత నిద్రకు అత్యంత శ్రేయస్కరం

పడమర వైపు తలపెట్టి పడుకోవడం వ్యాపారవేత్తలకు, కెరీర్‌లో ముందుకు వెళ్లాలనుకునే వారికి అనుకూలంగా ఉంటుంది.

అలాగే, సాయంత్రం సంధ్యా సమయంలో నిద్రపోవడం అస్సలు మంచిది కాదు. ఇది ధన, ఆహార కొరతకు దారితీస్తుంది. బట్టలు, డ్రెస్సింగ్ టేబుల్‌ను ఎప్పుడూ శుభ్రంగా, క్రమపద్ధతిలో ఉంచుకోవాలి. బెడ్‌రూమ్‌లో సానుకూల వాతావరణం ఉంటేనే ప్రశాంతమైన నిద్ర సొంతమవుతుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story