కానీ ధరించే ముందు ఈ జాగ్రత్తలు తప్పనిసరి

Blue Sapphire: నవగ్రహాలలో శని దేవుడు కర్మ ఫల ప్రదాత. క్రమశిక్షణ, సహనం, న్యాయానికి చిహ్నమైన శని గ్రహాన్ని ప్రసన్నం చేసుకోవడానికి, ఆ గ్రహ అనుగ్రహం పొందడానికి నీలమణిని ధరిస్తారు. అయితే ఇతర రత్నాలతో పోలిస్తే నీలమణి ఫలితాలు చాలా వేగంగా, ఒక్కోసారి అనూహ్యంగా ఉంటాయి. అందుకే దీనిని ధరించే ముందు జ్యోతిష్య నిపుణుల సలహా తీసుకోవడం అత్యవసరం.

నీలమణి ఎప్పుడు ధరించాలి?

సాధారణంగా శని మహాదశ జరుగుతున్నప్పుడు లేదా ఏలినాటి శని ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడు నీలమణిని సిఫార్సు చేస్తారు. జాతకంలో శని శుభప్రదంగా ఉండి పనులు ఆలస్యం అవుతున్నా లేదా ఆటంకాలు ఎదురవుతున్నా ఈ రత్నం అద్భుతంగా పనిచేస్తుంది. ఇది వ్యక్తిని సోమరితనం నుంచి బయటపడేసి క్రమశిక్షణ, బాధ్యత వైపు నడిపిస్తుంది.

ఎవరికి లాభిస్తుంది?

పరిపాలన, చట్టం, ఇంజనీరింగ్, రాజకీయాలు, నాయకత్వ రంగాలలో ఉన్నవారికి నీలమణి విశేషమైన విజయాలను అందిస్తుంది. సరైన వ్యక్తికి ఈ రత్నం పడితే కెరీర్‌లో వేగవంతమైన పురోగతి, ఆర్థిక స్థిరత్వం, సమాజంలో గౌరవం లభిస్తాయి.

జాగ్రత్తలు చాలా ముఖ్యం

నీలమణి అందరికీ సరిపడదు. తప్పుగా ధరిస్తే లేదా జాతకానికి సరిపోకపోతే ఇది సమస్యలను రెట్టింపు చేస్తుంది. రత్నం సహజంగా ఉండాలి, ఎలాంటి పగుళ్లు ఉండకూడదు. నీలమణి ధరించే ముందు దానిని ఒక గుడ్డలో కట్టి దిండు కింద పెట్టుకుని నిద్రపోవడం లేదా జేబులో ఉంచుకుని కొన్ని రోజులు గమనించడం వంటి 'టెస్టింగ్' పద్ధతులను జ్యోతిష్యులు సూచిస్తారు.

నీలమణిని ధరించే సరైన పద్ధతి

నీలమణి తన పూర్తి శక్తిని ప్రదర్శించాలంటే శాస్త్రోక్తంగా ధరించాలి..

లోహం: వెండి లేదా పంచధాతువుతో ఉంగరం చేయించుకోవాలి.

వేలు: కుడి చేతి మధ్య వేలుకి ధరించాలి.

సమయం: శనివారం సాయంత్రం, సూర్యాస్తమయం తర్వాత శుక్ల పక్షంలో ధరించడం శ్రేష్టం.

మంత్రం: ధరించే ముందు శని దేవుడిని స్మరిస్తూ ‘‘ఓం ప్రాం ప్రీం ప్రౌం సః శనైశ్చరాయ నమః’’ మంత్రాన్ని 108 సార్లు జపించాలి..

PolitEnt Media

PolitEnt Media

Next Story