భక్తులకు దివ్యానుభూతి

Brahmotsavam: తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడవ రోజు గురువారం రాత్రి 7 గంటలకు ముత్యపుపందిరి వాహనంపై శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామివారు భక్తులను కటాక్షించారు.

గజరాజులు, వృషభాలు, అశ్వాలు ముందుకు సాగుతుండగా, భజన బృందాలు కోలాటాలు ఆడుతూ, స్వామివారు ఆలయ నాలుగు మాడవీధుల్లో విహరించారు.

మనస్సుకు ఆహ్లాదాన్ని కలిగించే ముత్యపుపందిరి వాహనంపై స్వామివారి దర్శనం భక్తులకు విశేష ఆనందాన్ని కలిగించింది. జ్యోతిషశాస్త్రం ప్రకారం ముత్యం చంద్రునికి ప్రతీకగా భావించబడుతుంది. ముత్యాల పందిరి కింద స్వామివారి దర్శనం తాపత్రయాలను తొలగించి, భక్తుల జీవితాలకు శాంతి, చల్లదనాన్ని ప్రసాదిస్తుందని విశ్వసిస్తారు.

ఈ వాహనసేవలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ సురేష్, ఆలయ అర్చకులు మరియు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story