Sri Chennakesava Swamy and Sri Siddheswara Swamy: జూలై 24న తాళ్లపాకలో శ్రీ చెన్నకేశవస్వామి, శ్రీ సిద్ధేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

Sri Chennakesava Swamy and Sri Siddheswara Swamy: అన్నమాచార్యుల జన్మభూమి తాళ్లపాకలో వెలసిన శ్రీ చెన్నకేశవస్వామి, శ్రీ సిద్ధేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు జూలై 25 నుంచి ఆగస్టు 2 వరకు అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాలకు ముందుగా జూలై 24వ తేదీ సాయంత్రం 5 గంటలకు రెండు ఆలయాల్లో శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించనున్నారు.
శ్రీ చెన్నకేశవస్వామివారి ఆలయంలో
జూలై 25న ఉదయం 10.30 నుంచి 11 గంటల మధ్య ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమై, రాత్రి శేషవాహన సేవ జరుగుతుంది.
ఉత్సవాల్లో భాగంగా…
జూలై 26 – ఉదయం పల్లకీ సేవ, రాత్రి హంసవాహనం
జూలై 27 – ఉదయం పల్లకీ ఉత్సవం, రాత్రి సింహవాహనం
జూలై 28 – ఉదయం పల్లకీ ఉత్సవం, రాత్రి హనుమంత వాహనం
జూలై 29 – ఉదయం మోహినీ అవతారం, రాత్రి గరుడసేవ (ప్రత్యేక ఆకర్షణ)
జూలై 30 – సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు ఆర్జిత కల్యాణోత్సవం
జూలై 31 – సాయంత్రం 6 గంటలకు రథోత్సవం
ఆగస్టు 1 – రాత్రి అశ్వవాహనం
ఆగస్టు 2 – ఉదయం 10 గంటలకు చక్రస్నానం, రాత్రి 7 గంటలకు ధ్వజావరోహణం
బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజూ ఉదయం 8 గంటలకు, రాత్రి 7 గంటలకు వాహనసేవలు నిర్వహిస్తారు.
శ్రీ సిద్ధేశ్వరస్వామివారి ఆలయంలో
జూలై 25న ఉదయం 6.05 గంటలకు ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమై, రాత్రి హంసవాహన సేవ జరుగుతుంది.
ఉత్సవాల విశేషాలు…
జూలై 26 – ఉదయం పల్లకీ సేవ, రాత్రి చంద్రప్రభ వాహనం
జూలై 27 – ఉదయం పల్లకీ ఉత్సవం, రాత్రి చిన్నశేష వాహనం
జూలై 28 – ఉదయం పల్లకీ ఉత్సవం, రాత్రి సింహవాహనం
జూలై 29 – ఉదయం పల్లకీ ఉత్సవం, రాత్రి నందివాహనం
జూలై 30 – సాయంత్రం 6 గంటలకు ఆర్జిత కల్యాణోత్సవం, అనంతరం గజవాహనం
జూలై 31 – సాయంత్రం పల్లకీ సేవ
ఆగస్టు 1 – సాయంత్రం 6 గంటలకు పార్వేట ఉత్సవం
ఆగస్టు 2 – వసంతోత్సవం, త్రిశూలస్నానం, సాయంత్రం 5 గంటలకు ధ్వజావరోహణం
ఈ ఆలయంలో ప్రతిరోజూ ఉదయం 8 గంటలకు, సాయంత్రం 6 గంటలకు వాహనసేవలు నిర్వహిస్తారు.
ఆర్జిత కల్యాణోత్సవం
రెండు ఆలయాల్లోనూ జూలై 30న ఆర్జిత కల్యాణోత్సవం నిర్వహించనున్నారు. గృహస్తులు (ఇద్దరు) రూ.300/- చెల్లించి పాల్గొనవచ్చు. పాల్గొనే వారికి ఉత్తరీయం, రవికె, లడ్డూ, అప్పం, అన్నప్రసాదం అందజేయనున్నారు.
ఆగస్టు 3న పుష్పయాగం
ఆగస్టు 3న ఉదయం శ్రీ చెన్నకేశవస్వామి, శ్రీ సిద్ధేశ్వరస్వామివారి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహించి, సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు పుష్పయాగం వైభవంగా జరగనుంది.

