Shiva Lingam: శివలింగాన్ని ఇంట్లో పెట్టుకోవచ్చా?
ఇంట్లో పెట్టుకోవచ్చా?

Shiva Lingam: సాధారణంగా శివలింగాన్ని ఇంట్లో పెట్టుకోవచ్చా, లేదా అనే విషయంలో చాలా మందికి సందేహాలు ఉంటాయి. జ్యోతిష్యులు, పండితులు చెప్పేది ఏమిటంటే శివలింగాన్ని ఇంట్లో పూజించుకోవడం శుభప్రదం. అయితే, కొన్ని నియమాలను పాటించడం చాలా ముఖ్యం. శివలింగం సాక్షాత్తు శివ స్వరూపం కాబట్టి, దాన్ని పూజించేటప్పుడు పవిత్రత, భక్తి శ్రద్ధలు తప్పనిసరి.
ఇంట్లో శివలింగాన్ని పెట్టుకోవడానికి కొన్ని ముఖ్యమైన నియమాలు ఉన్నాయి అవి ఏంటీ ఇప్పుడు తెలుసుకుందాం.
నియమబద్ధమైన పూజ: శివలింగాన్ని ప్రతిరోజు క్రమం తప్పకుండా పూజించాలి. అభిషేకం, నైవేద్యం వంటివి నిర్ధిష్ట సమయాల్లో చేయాలి. ఒకవేళ ప్రతిరోజు పూజ చేయడం సాధ్యం కాకపోతే, శివలింగాన్ని ఇంట్లో ఉంచకపోవడమే మంచిది.
పరిశుభ్రత: శివలింగం ఉంచిన ప్రదేశం ఎల్లప్పుడూ శుభ్రంగా, పవిత్రంగా ఉండాలి. ఎలాంటి అపరిశుభ్రత లేకుండా చూసుకోవాలి.
సరైన దిశ: శివలింగాన్ని ఎల్లప్పుడూ ఉత్తరం దిశలో ఉంచాలి. శివలింగం ముఖం దక్షిణం వైపు ఉండేలా చూసుకోవాలి.
స్థలం: శివలింగాన్ని బెడ్రూమ్ వంటి వ్యక్తిగత గదుల్లో కాకుండా, పూజ గదిలో లేదా ఇంట్లోని పవిత్రమైన ప్రదేశంలో ఉంచాలి.
పరిమాణం: ఇంట్లో పూజించుకునే శివలింగం చిన్న పరిమాణంలో ఉండాలి. ఎందుకంటే పెద్ద లింగాన్ని పూజించడానికి ఎక్కువ కఠినమైన నియమాలు ఉంటాయి.
ఈ నియమాలను పాటించి పూజించినట్లయితే, శివలింగం ఇంట్లో ఉంచుకోవడం వల్ల ఎలాంటి దోషం ఉండదు. బదులుగా, అది ఇంట్లో శాంతి, సంపద, ఐశ్వర్యం తీసుకువస్తుందని నమ్మకం. మీరు శివలింగాన్ని ఇంట్లో పెట్టుకోవాలని ఆలోచిస్తుంటే, ఈ నియమాలను పాటించగలరా లేదా అనేది ఒకసారి ఆలోచించుకోండి. ఒకవేళ వాటిని పాటించడం కష్టమైతే, శివాలయానికి వెళ్లి పూజించుకోవడం మంచిది.
