People with the Same Zodiac Sign and Nakshatra Marry: ఒకే రాశి, ఒకే నక్షత్రం ఉన్నవారు పెళ్లి చేసుకోవచ్చా? జ్యోతిష్య శాస్త్రం ఏం చెబుతోంది..?
జ్యోతిష్య శాస్త్రం ఏం చెబుతోంది..?

People with the Same Zodiac Sign and Nakshatra Marry: వివాహ నిశ్చయ సమయంలో జాతక చక్రాల పరిశీలన అత్యంత ముఖ్యం. ముఖ్యంగా వధూవరుల రాశి లేదా నక్షత్రం ఒకటే అయితే పెళ్లి చేయవచ్చా? అనే సందేహం చాలామందిలో ఉంటుంది. దీనినే జ్యోతిష్య పరిభాషలో ఏక నక్షత్ర వివాహం అంటారు. కొన్ని నక్షత్రాల వారికి ఇది శుభప్రదమైతే, మరికొందరికి మాత్రం నిషిద్ధమని పండితులు చెబుతున్నారు.
ఎప్పుడు వివాహం చేసుకోవచ్చు?
వధూవరుల నక్షత్రం ఒకటే అయినప్పటికీ వారి పాదాలు వేర్వేరుగా ఉన్నప్పుడు కొన్ని నక్షత్రాలలో వివాహానికి అనుమతి ఉంది. ఈ క్రింది నక్షత్రాల వారు నిశ్చింతగా ముందడుగు వేయవచ్చు..
రోహిణి, ఆర్ద్ర, మకర, హస్త, వైశాఖ, శ్రవణ, ఉత్తరాభద్ర, రేవతి.
ఈ నక్షత్రాల కింద జన్మించిన వారు పాదాల తేడా ఉంటే వివాహం చేసుకోవడం చెల్లుబాటు అవుతుంది.
మధ్యమ ఫలితాలు ఇచ్చే నక్షత్రాలు:
కొన్ని నక్షత్రాల విషయంలో ఏక నక్షత్ర వివాహం అంత శుభప్రదం కాదని, కేవలం సగటు ఫలితాలను మాత్రమే ఇస్తాయని పండితులు తెలిపారు. అవి అశ్విని, కృత్తిక, మృగశిర, పునర్వసు, పుష్య, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ.
ఏ నక్షత్రాల వారు అస్సలు పెళ్లి చేసుకోకూడదు?
కొన్ని నక్షత్రాల వారికి ఒకే నక్షత్రంలో వివాహం చేసుకోవడం శాస్త్రరీత్యా పూర్తిగా నిషిద్ధం. పాదాలు వేరైనా సరే, ఈ నక్షత్రాల వారి మధ్య సంబంధం బాగుండదని జ్యోతిష్యులు హెచ్చరిస్తున్నారు..
నక్షత్రాలు: భరణి, ఆశ్లేష, స్వాతి, జ్యేష్ఠ, మూల, ధనిష్ఠ, శతభిష, పూర్వభద్ర.
పరిణామాలు: ఇటువంటి వివాహాల వల్ల జీవితాంతం కష్టాలు, ఆరోగ్య సమస్యలు, సంతాన లేమి, దంపతుల మధ్య తీవ్ర విభేదాలు వచ్చే అవకాశం ఉంటుంది.
అహంబ్రాహ్మస్మి: ఒకే నక్షత్రం ఉన్నప్పుడు ఇద్దరి మధ్య "నేనే గొప్ప" అనే అహం పెరిగి, వారి మధ్య సఖ్యత లోపిస్తుందని శాస్త్రం చెబుతోంది.
ఒకే రక్త సంబంధీకుల మధ్య వివాహం చేసుకున్నప్పుడు ఎలాంటి మానసిక, ఆరోగ్య అవాంతరాలు తలెత్తుతాయో, ఏక నక్షత్ర వివాహాల విషయంలో కూడా అంతే జాగ్రత్తగా ఉండాలి. పెళ్లి అనేది నూరేళ్ల పంట. అందుకే ఒకే నక్షత్రం లేదా రాశి ఉన్నవారు ఎలాంటి నిర్ణయం తీసుకునే ముందైనా, అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించి, జాతక చక్రాలను క్షుణ్ణంగా సమీక్షించుకోవడం ఉత్తమం. గుడ్డిగా ముందడుగు వేయకుండా శాస్త్రోక్తంగా నిర్ణయం తీసుకోవడం వల్ల వైవాహిక జీవితం సుఖసంతోషాలతో సాగుతుంది.

