Pregnant Women Worship the Shiva Lingam: గర్భిణులు శివలింగాన్ని పూజించవచ్చా?
శివలింగాన్ని పూజించవచ్చా?

Pregnant Women Worship the Shiva Lingam: గర్భిణులు శివలింగాన్ని నిరభ్యంతరంగా పూజించవచ్చని పండితులు చెబుతున్నారు. దీనికి ఎటువంటి నిషేధం లేదంటున్నారు. శివారాధన వల్ల తల్లికి మానసిక ప్రశాంతత, బిడ్డకు రక్షణ లభిస్తాయని సూచిస్తున్నారు. అయితే శరీరాన్ని కష్టపెట్టే కఠిన ఉపవాసాలు, నియమాలకు దూరంగా ఉండాలని చెబుతున్నారు. ఎక్కువ సేపు నిలబడకుండా కూర్చుని పూజ చేయాలంటున్నారు. గుడికి వెళ్లలేని వారు ఇంట్లోనే చిన్న శివలింగానికి పూజ చేయవచ్చని అంటున్నారు.
శివాలయంలో కొన్ని నియమాలు తప్పక పాటించాలని పండితులు సూచిస్తున్నారు. ‘ప్రదోష కాల దర్శనం గ్రహ దోష నివారణకు శ్రేష్ఠం. గణపతి దర్శనానంతరం లింగాన్ని దర్శించాలి. నంది కొమ్ముల నుంచి శివలింగాన్ని చూడటం మర్వకూడదు. శివునికి అర్చించిన ప్రసాదం, విభూతి, పూలను నందిపై ఉంచరాదు. సోమసూత్రాన్ని దాటకుండా ప్రదక్షిణలు చేయాలి’ అంటున్నారు.
భర్త చేయకూడని పనులివే..
ఏడో నెల నుంచి భర్త క్షవరం చేయించుకోకూడదు. సముద్ర స్నానం, పడవ ప్రయాణం, పర్వతారోహణ వంటి సాహసాలు చేయకూడదు. శవయాత్రల్లో పాల్గొనడం, పిండదానాలు చేయడం వంటి అశుభ కార్యాలకు వెళ్లరాదు. గృహ నిర్మాణం, విదేశీ ప్రయాణాలు మానాలి. ఈ నియమాల ముఖ్య ఉద్దేశం భార్యకు మానసిక ప్రశాంతతనివ్వడం, పుట్టబోయే బిడ్డకు ఎటువంటి అరిష్టం కలగకుండా చూడటం. భార్య కోరికలు తీరుస్తూ ఆమెను సంతోషంగా ఉంచడమే భర్త ప్రధాన కర్తవ్యం.

