వాస్తు ఏం చెబుతోంది?

Direction of a Dressing Table Cause Marital Conflicts: ఇల్లు అందంగా ఉండటమే కాదు, ఇంట్లోని వస్తువులు కూడా సరైన దిశలో ఉండాలని వాస్తు శాస్త్రం చెబుతోంది. ముఖ్యంగా బెడ్‌రూమ్‌లో మనం వాడే డ్రెస్సింగ్ టేబుల్ కేవలం మేకప్ కోసమే కాదు, అది దంపతుల మధ్య ప్రేమను పెంచడానికి లేదా తగ్గించడానికి కూడా కారణమవుతుంది. డ్రెస్సింగ్ టేబుల్ అమరికలో చేసే చిన్న పొరపాటు వైవాహిక జీవితంలోని ఆనందాన్ని దెబ్బతీస్తుందని వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు.

డ్రెస్సింగ్ టేబుల్ ఎక్కడ ఉండాలి?

బెడ్‌రూమ్‌లో డ్రెస్సింగ్ టేబుల్‌ను ఉంచడానికి కొన్ని దిశలు అత్యంత శుభప్రదమైనవి:

తూర్పు, ఉత్తరం లేదా పడమర: ఈ దిశలలో డ్రెస్సింగ్ టేబుల్ ఉండటం వల్ల ఇంట్లో సానుకూలత పెరుగుతుంది.

ఈశాన్యం లేదా వాయువ్యం: ఈ మూలల్లో అద్దం లేదా డ్రెస్సింగ్ టేబుల్‌ను అమర్చుకోవడం వల్ల భార్యాభర్తల మధ్య సామరస్యం పెరుగుతుంది, బంధం బలోపేతం అవుతుంది.

ఏ దిశలో అస్సలు ఉండకూడదు?

వాస్తు ప్రకారం కొన్ని దిశలు డ్రెస్సింగ్ టేబుల్‌కు అస్సలు సరిపడవు:

దక్షిణం, నైరుతి లేదా ఆగ్నేయం: ఈ దిశలలో డ్రెస్సింగ్ టేబుల్‌ను ఎప్పుడూ ఉంచకూడదు. ముఖ్యంగా ఆగ్నేయం అగ్ని స్థానం. అక్కడ అద్దాన్ని ఉంచడం వల్ల ప్రతికూల శక్తి పెరిగి ఇంట్లో చిన్న చిన్న విషయాలకే గొడవలు, విభేదాలు వచ్చే అవకాశం ఉంది.

దక్షిణ దిశ ప్రభావం: దక్షిణ దిశలో కూర్చుని మేకప్ చేసుకోవడం వల్ల జీవిత భాగస్వామి ఆరోగ్యం దెబ్బతినడమే కాకుండా, ఇంట్లో జరిగే శుభకార్యాలకు ఆటంకాలు ఏర్పడతాయని, ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయని నమ్ముతారు.

మహిళలు గమనించాల్సిన విషయం

మహిళలు మేకప్ వేసుకునేటప్పుడు సరైన దిశలో కూర్చుంటే అది వారి సౌభాగ్యాన్ని, అదృష్టాన్ని కాపాడుతుందని వాస్తు చెబుతోంది. మీరు మేకప్ చేసుకునేటప్పుడు మీ ముఖం తూర్పు లేదా ఉత్తర దిశకు ఉండేలా చూసుకోవడం ఉత్తమం.

PolitEnt Media

PolitEnt Media

Next Story