Devotional: ఇంటి ముందు వినాయకుడి విగ్రహం పెట్టొచ్చా.?
వినాయకుడి విగ్రహం పెట్టొచ్చా.?

Devotional: మన దేశంలో గణేశుడికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది.ఏ కార్యక్రమం చేసినా గణపతి పూజతో మొదలు పెడుతుంటారు. చాలామంది వాస్తు శాస్త్రం ప్రకారం గణపతి విగ్రహాన్ని ఇంటి మెయిన్ గేట్దగ్గర ప్రతిష్టించుకుంటారు. అసలు ఇంటి ముందు వినాయకుడి విగ్రహాన్ని అందరూ ప్రతిష్టించుకోవచ్చా.. ఇంటి ముందు వినాయకుడి విగ్రహం ఎందుకు పెట్టుకుంటారు? పెట్టకపోతే నష్టమా? ఏఏ సందర్భాల్లో పెట్టుకోవాలి.
మెయిన్ గేట్ కు పక్కన వినాయకుడి విగ్రహం పెట్టుకోవడం తప్పుకాదని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఇంట్లో నుంచి బయటకు వెళ్లేటప్పుడు దేవుడికి దండం పెట్టుకుని వెళ్తే శుభం జరుగుతుందంట. విగ్రహం పెట్టుకోకపోయినా నష్టం ఏమీ జరగదు. మన ఇష్టాన్ని బట్టి నిర్ణయం తీసుకోవాలని వాస్తుకు, దీనికి ఎలాంటి సంబంధం లేదని చెబుతున్నారు.
కొందరు తమ ఇంటి ప్రధాన ద్వారానికి రకరకాల దేవుళ్ళు, డిజైన్స్ ను ఏర్పాటు చేసుకుంటారు. ఇంటి ప్రధాన ద్వారం పైభాగంలో వినాయకుడి బొమ్మను ఉంచడం వల్ల కుటుంబానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా ఐశ్వర్యం చేకూరుతుందని పండితులు అంటున్నారు. ఇలా చేయడం వలన ఇంటికి శుభం కలుగుతుందని నమ్మకం.మెయిన్ డోర్ పై ఫోటో పెట్టడం వల్ల ఇంట్లోకి నెగెటివిటీ రాదు. ఇంట్లో అంతా సానుకూలంగానే ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య గొడవలు ఉండవు. ఇంట్లో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది.
