పూజలు చేయవచ్చా..?

Vibhuti and Kumkum: కుంకుమ, విభూతి లేకుండా దైవిక సేవలు చేయగలరా? అంటే లేదు అనే చెప్తారు. హిందూ మతం, సంస్కృతిలో కుంకుమ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. దీనిని మతపరమైన ఆచారాలలోనే కాకుండా, దైనందిన జీవితంలో కూడా ఉపయోగిస్తారు. హిందువులు కుంకుమను శుభానికి, అదృష్టానికి చిహ్నంగా భావిస్తారు. దానిని నుదిటిపై లేదా పూజ సమయంలో అలంకరణగా ఉపయోగిస్తారు. విభూతిని శివునికి సంబంధించిన పవిత్రమైన పదార్థంగా భావిస్తారు.

బ్రహ్మ వైవర్త పురాణం వంటి పురాణాలలో కుంకుమ, విభూతి ఉపయోగం గురించి ప్రస్తావించబడింది. పురాణాల ప్రకారం.. కుంకుమ లేదా విభూతి లేకుండా దేవతలు, పూర్వీకుల విధులను నిర్వర్తించడం వ్యర్థం. వీటిని ధరించడం వల్ల దేవతల నుండి ఆశీస్సులు, పూర్వీకుల నుండి ఆనందం లభిస్తాయని నమ్ముతారు. అలాగే సుషుమ్ననాడిని మేల్కొల్పడం ద్వారా ఆధ్యాత్మిక పురోగతిని సాధించడంలో ఇది సహాయపడుతుందని నమ్ముతారు.

కుంకుమ, విభూతి ధరించే వారిని సమాజంలో గౌరవంగా చూస్తారు. ఇది వారి మత విశ్వాసాలు, ఆచారాలను ప్రతిబింబిస్తుంది. అయితే ఇది విశ్వాసానికి సంబంధించిన విషయం. అందరికీ ఒకేలాంటి నమ్మకాలు ఉండవని మర్చిపోకూడదు. కుంకుమ, విభూతి వాడకం వ్యక్తి వ్యక్తిగత నమ్మకాలు, ఆచారాలపై ఆధారపడి ఉంటుందని మత గురువులు వివరించారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story