కృష్ణమ్మకు జలహారతి సమర్పించిన చంద్రబాబు

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైన శ్రీభ్రమరాంబ మల్లికార్జన స్వామివారిని దర్శించుకున్నారు. మధ్యాహ్నం శ్రీశైలం దేవస్ధానానికి చేరుకున్న చంద్రబాబుకి ఆలయ సాంప్రదాయం ప్రకారం అధికారులు, అ్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ముందుగా రత్నగర్భ గణపతిని దర్శించుకున్న చందరబాబ అనంతరం మల్లికార్జున స్వామిని, భ్రమరాంబ అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మల్లిఖార్జునుడికి జరిగిన అర్చన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయంలో జరుగుతున్న రుద్ర హోమం పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వామివారి మండపంలో వేద పండితులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు వేదాశీర్వనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. శ్రీశైల మల్లికార్జునుడి దర్శనం అనంతరం ముఖ్యమంత్రి డామ్‌ ను సందర్శించారు. గడచిన నాలుగు రోజులుగా డ్యామ్‌ లో కి వచ్చి చేరుతున్న వరద నీటిని పరిశీలించారు. ఈ సందర్భంగా కృష్ణమ్మకు హరతి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నిమ్మల రామానాయుడు, బీసీ జనార్దన్ రెడ్డి, ఎన్ ఎండి ఫరూక్, ఎంపీ బైరెడ్డి శబరి, ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా, దేవదాయ శాఖ సెక్రెటరీ వినయ్ చంద్, కమిషనర్ రామచంద్ర మోహన్, జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా, జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్, ఆలయ ఈవో శ్రీనివాసరావు, జేఈవో, పిఆర్వోలు, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Updated On 8 July 2025 2:55 PM IST
Politent News Web 1

Politent News Web 1

Next Story