Tirumala Tirupati Devasthanams: శ్రీవారి దర్శన క్యూలైన్ లో నిన్న రాత్రి రాజమహేంద్రవరానికి చెందిన శ్రీ అనుపోజు వీర నవీన్ అనే భక్తుడు నారాయణగిరి షెడ్లలో తోటి భక్తులను ప్రేరేపించి నినాదాలు చేశాడు.ఈ విషయం టీటీడీ దృష్టికి రావడంతో సదరు భక్తుడిని పిలిపించి మాట్లాడగా దర్శన క్యూలైన్ లో నినాదాలు చేయడం ముమ్మాటికీ తన తప్పేనని ఒప్పుకున్నాడు. ఇందుకుగాను టీటీడీ, శ్రీవారి భక్తులకు ఆ భక్తుడు క్షమాపణలు తెలియజేశాడు. కాగా భక్తులందరూ శ్రీవారి దర్శనంలో తమ వంతు వచ్చే వరకు సంయమనంతో ఓపిగ్గా వేచి ఉంటూ సిబ్బందికి సహకరించాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. మరోవైపు హైదరాబాద్ కు చెందిన శ్రీమతి రాధిక శ్రీ వేంకటేశ్వర సర్వ శ్రేయాస్ ట్రస్టుకు శుక్రవారం రూ.10 లక్షలు విరాళంగా అందించారు. ఈ మేరకు దాత తిరుమలలోని పద్మావతి అతిథి గృహంలో టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర కు విరాళం డీడీని అందజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు.

Next Story