Clapping Your Hands: చప్పట్లు కొడుతున్నారా? అయితే ఈ విషయాలు తెలుసుకోండి.. అది కేవలం ధ్వని మాత్రమే కాదు ఒక శక్తి..
అది కేవలం ధ్వని మాత్రమే కాదు ఒక శక్తి..

Clapping Your Hands: మనం సంతోషం కలిగినా, ఎవరినైనా అభినందించాలన్నా వెంటనే చేసే పని చప్పట్లు కొట్టడం. అయితే ఈ చప్పట్లు కొట్టడం వెనుక అపారమైన ఆధ్యాత్మిక శక్తి మరియు శాస్త్రీయ ప్రయోజనాలు ఉన్నాయని మీకు తెలుసా? ప్రఖ్యాత జ్యోతిష్య నిపుణులు.. చప్పట్లు కొట్టడం వల్ల కలిగే లాభాలను వివరించారు.
ఆధ్యాత్మిక ప్రాముఖ్యత: భక్తికి మార్గం
హిందూ సంప్రదాయంలో భజనలు, కీర్తనలు చేసేటప్పుడు చప్పట్లు కొట్టడం ఒక ముఖ్యమైన భాగం.
ఏకాగ్రత:
చప్పట్లు కొడుతూ భగవంతుడిని స్మరించడం వల్ల మనస్సు ఇతర ఆలోచనల వైపు వెళ్లకుండా ఏకాగ్రత పెరుగుతుంది.
సానుకూల శక్తి:
"శ్రీ రామ్ జైరాం" వంటి మంత్రాలను పఠిస్తూ చప్పట్లు కొట్టడం వల్ల శరీరంలో సానుకూల శక్తి ప్రవహిస్తుంది. ఇది భక్తిని మేల్కొల్పి, మానసిక ప్రశాంతతను ఇస్తుంది.
శాస్త్రీయ ప్రయోజనం: అరచేతుల్లోనే ఆరోగ్యం..
హస్తసాముద్రికం, ఆక్యుప్రెషర్ ప్రకారం.. మన అరచేతుల్లో శరీరంలోని వివిధ అవయవాలకు సంబంధించిన పాయింట్లు ఉంటాయి.
రోగనిరోధక శక్తి:
చప్పట్లు కొట్టినప్పుడు ఆ పాయింట్లపై ఒత్తిడి కలిగి రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఇది శరీర రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
ఒత్తిడి తగ్గింపు:
క్రమం తప్పకుండా చప్పట్లు కొట్టడం వల్ల ఒత్తిడి తగ్గి, కొన్ని సందర్భాల్లో మందుల అవసరం లేకుండానే మానసిక ఉల్లాసం లభిస్తుందని నమ్ముతారు.
ఎప్పుడు కొట్టాలి? ఎప్పుడు కొట్టకూడదు?
చప్పట్లు కొట్టే విధానం సందర్భం చాలా ముఖ్యమని హెచ్చరించారు:
విజయోత్సవాలు, ప్రశంసలు, పిల్లలను ప్రోత్సహించేటప్పుడు దైవ ప్రార్థనలో చప్పట్లు కొట్టడం వల్ల దీర్ఘాయువు, సానుకూలత లభిస్తాయి.
అశుభం:
ఎవరినైనా ఎగతాళి చేయడానికి, అవమానించడానికి లేదా వ్యంగ్యంగా చప్పట్లు కొట్టడం వల్ల ప్రతికూల శక్తి ఏర్పడుతుంది. అలాగే శోక సమయాల్లో లేదా మరణం సంభవించినప్పుడు చప్పట్లు కొట్టడం అశుభంగా పరిగణించబడుతుంది.

