శాస్త్రోక్తంగా ద‌క్షిణామూర్తి హోమం

Dakshinamurthy Homam Performed Traditionally: తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో నెల రోజుల పాటు జరుగుతున్న హోమ మహోత్సవాల్లో భాగంగా సోమ‌వారం ద‌క్షిణామూర్తి హోమం శాస్త్రోక్తంగా జరిగింది. ఇందులో భాగంగా యాగశాలలో ఉదయం 8 నుండి 11 గంటల వరకు ద‌క్షిణామూర్తి హోమం, పూర్ణాహుతి, కలశ ఉద్వాసన, మహాశాంతి అభిషేకం, ద‌క్షిణామూర్తి కలశాభిషేకం నిర్వహించారు. సాయంత్రం 5.30 గంటలకు శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి దివ్యకల్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. అక్టోబరు 28న శ్రీ న‌వ‌గ్ర‌హ‌ హోమం హోమం జ‌రుగ‌నుంది. గృహస్తులు రూ. 500/- చెల్లించి ఒక రోజు హోమంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, అన్నప్రసాదం అందజేస్తారు. ఈ కార్యక్రమంలో ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీమ‌తి నాగ‌ర‌త్న‌, సూప‌రింటెండెంట్‌ శ్రీ చంద్ర‌శేఖ‌ర్‌, ఆలయ అర్చకులు, విశేష సంఖ్య‌లో భ‌క్తులు పాల్గొన్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story