Delayed Marriage Due to Pitru Dosha: ఎంత ప్రయత్నించినా వివాహం కుదరకపోవడం, సంబంధాలు చివరిదాకా వచ్చి రద్దయిపోవడం వంటి సమస్యలు చాలామందిని వేధిస్తుంటాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వివాహంలో ఎదురయ్యే ఇలాంటి అడ్డంకులకు జాతకంలో ఉండే "పితృదోషం" కూడా ఒక ప్రధాన కారణం కావచ్చు. పితృదోషం వల్ల ఎదురయ్యే ప్రభావాలు, దాని లక్షణాలు మరియు నివారణ మార్గాలపై ఆధ్యాత్మిక కథనం.

పితృదోషం అంటే ఏమిటి?

పూర్వీకులకు లేదా పితృదేవతలకు సకాలంలో శాస్త్రోక్తంగా శ్రాద్ధ కర్మలు, తర్పణాలు జరపకపోవడం వల్ల లేదా వారు మరణించే సమయంలో అసంతృప్తిగా ఉండటం వల్ల జాతకంలో పితృదోషం ఏర్పడుతుందని నమ్ముతారు. సూర్యుడు లేదా చంద్రుడితో రాహువు, కేతువులు సంయోగం చెందినప్పుడు జాతక చక్రంలో ఈ దోష ప్రభావం మరింత తీవ్రంగా ఉంటుంది.

వివాహం విషయంలో కనిపించే ప్రధాన లక్షణాలు..

సంబంధాలు నిలబడకపోవడం

మంచి సంబంధాలు వచ్చినట్లే వచ్చి ఆఖరి క్షణంలో కారణం లేకుండా తప్పిపోవడం.

వయసు దాటిపోవడం: అన్ని అర్హతలు, అనుకూలతలు ఉన్నప్పటికీ వయసు పైబడుతున్నా పెళ్లి కుదరకపోవడం.

కుటుంబంలో మనశ్శాంతి కరవవడం:

పెళ్లి ప్రస్తావన వచ్చినప్పుడల్లా ఇంట్లో కలహాలు, అశాంతి ఏర్పడటం.

మానసిక ఒత్తిడి:

నిరంతరం నిరాశ, ఆందోళన కలగడం, కలలో పితృదేవతలు లేదా పాములు కనిపించడం.

పితృదోష నివారణకు సులువైన పరిహారాలు..

పితృపక్షం - అమావాస్య తర్పణం:

ప్రతి అమావాస్యకు మరియు పితృపక్ష సమయంలో పూర్వీకులను స్మరిస్తూ నువ్వులు, నీళ్లతో తర్పణాలు వదలడం, వారి పేరున అన్నదానం చేయడం అత్యంత శ్రేయస్కరం.

రావి చెట్టు పూజ:

ప్రతిరోజూ లేదా శనివారం నాడు రావి చెట్టుకు నీరు సమర్పించి, ప్రదక్షిణలు చేసి, నువ్వుల నూనెతో దీపం వెలిగించడం వల్ల పితృదేవతలు శాంతిస్తారు.

ఆవులకు గ్రాసం: గోవుకు పచ్చిగడ్డి, బెల్లం లేదా అరటిపండ్లు తినిపించడం వల్ల సమస్త దోషాలు తొలగి వివాహ మార్గం సుగమమవుతుంది.

గాయత్రీ మంత్రం - శివారాధన

రోజూ గాయత్రీ మంత్రాన్ని లేదా మహా మృత్యుంజయ మంత్రాన్ని జపించడం, శివునికి జలాభిషేకం చేయడం వల్ల గ్రహ దోషాల తీవ్రత తగ్గుతుంది.

ఈ పరిహారాలను విశ్వాసంతో ఆచరించడం ద్వారా పితృదేవతల ఆశీస్సులు లభించి, వివాహ ప్రయత్నాల్లోని ఆటంకాలు తొలగి త్వరలోనే శుభవార్త వినే అవకాశం ఉంటుందని పండితులు చెబుతున్నారు.

Next Story