Kondagattu Temple: జగిత్యాల జిల్లా చొప్పదండి నియోజకవర్గంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. ఈరోజు మంగళవారం కావడంతో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు.

తెల్లవారుజాము నుంచే ఆలయానికి చేరుకున్న భక్తజనం... స్వామివారి ప్రత్యేక పూజలు, అర్చనల్లో పాల్గొన్నారు. క్యూలైన్లలో గంటల తరబడి వేచి ఉండి, క్రమశిక్షణతో అంజన్నను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల రాకతో ఆలయ ప్రాంగణమంతా కోలాహలంగా మారింది. జై శ్రీరామ్... జై ఆంజనేయ అనే నామస్మరణతో కొండగట్టు పరిసరాలు మారుమోగిపోతున్నాయి.

మరోవైపు... భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ఎండ తీవ్రత దృష్ట్యా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తాగునీరు, క్యూలైన్ల నిర్వహణను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. స్వామివారి ఆశీస్సులు పొందేందుకు తరలివచ్చిన భక్తులతో కొండగట్టు అంతటా ఆధ్యాత్మిక వాతావరణం సంతరించుకుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story