Sri Soumyanathaswamy: హనుమంత వాహనంపై శ్రీ సౌమ్యనాథస్వామి కటాక్షం
శ్రీ సౌమ్యనాథస్వామి కటాక్షం

Sri Soumyanathaswamy: అన్నమయ్య జిల్లా నందలూరు శ్రీ సౌమ్యనాథస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా జూలై 08వ తేదీ ఉదయం పల్లకి ఉత్సవం చేపట్టారు. ఉదయం 11 గం.లకు స్వామివారికి స్నపన తిరుమంజనం నిర్వహించారు. సాయంత్రం స్వామివారికి డోలోత్సవము చేప్టటారు. రాత్రి 07. 00 గం.లకు హనుమంత వాహనంపై శ్రీ సౌమ్యనాథ స్వామి భక్తులను అనుగ్రహించారు. జూలై 09వ తేదీన ఉదయం శేష వాహనం, రాత్రి గరుడ వాహనంపై స్వామివారు భక్తులను ఆశీర్వదించనున్నారు.
చిన్న శేష వాహనంపై శ్రీ సిద్దేశ్వర స్వామి :
తాళ్లపాక శ్రీ సిద్దేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా జూలై 08వ తేదీ ఉదయం పల్లకీ సేవ, సాయంత్రం 06 – 07 గం.ల మధ్య చిన్నశేష వాహనంపై శ్రీ సిద్ధేశ్వర స్వామి విహరించారు. జూలై 09న ఉదయం పల్లకీ సేవ, సాయంత్రం సింహ వాహనంపై స్వామి వారు భక్తులను కటాక్షిస్తారు.
సింహ వాహనంపై శ్రీ చెన్నకేశవ స్వామి
తాళ్లపాక శ్రీ చెన్నకేశవ స్వామి వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా జూలై 08వ తేదీ ఉదయం పల్లకీ ఉత్సవం నిర్వహించారు. రాత్రి 07.00 గం.లకు సింహ వాహనంపై స్వామి వారు విహరించి భక్తులను ఆశీర్వదించారు. జూలై 09వ తేదీ ఉదయం పల్లకీ సేవ చేపడుతారు. రాత్రికి హనుంత వాహనంపై శ్రీ చెన్నకేశవ స్వామి విహరించి భక్తులను అనుగ్రహిస్తారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ శ్రీ హనుమంతయ్య, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ దిలీప్ పాల్గొన్నారు.
