ఇవాళ ఏం చేయాలి?

Diwali: హిందువులకు ముఖ్యమైన పండుగల్లో దీపావళి ఒకటి. ఇవాళ ఉదయాన్నే నిద్రలేచి అభ్యంగన స్నానం చేయాలి. ఇంటిని శుభ్రం చేసి సాయంకాలం దీపాలతో అలంకరించాలి. కుటుంబసభ్యులతో కలిసి లక్ష్మీదేవిని, కుబేరుడిని పూజించాలని పండితులు చెబుతున్నారు. ఇంట్లో తయారు చేసిన మిఠాయిలను నైవేద్యంగా పెట్టాలి. దుస్తులు, స్వీట్లు లేదా ఆహారపదార్థాలను దానం చేయాలి.

ఇంటిల్లిపాది ఎంతో సంతోషంగా చేసుకునే పండుగ దీపావళి. ఇవాళ లక్ష్మీపూజ, పితృదేవతలకు దివిటీ చూపించడం, దీపదానం వంటివి చేయడం శుభప్రదమని పండితులు చెబుతున్నారు. సా.7 నుంచి రా.8.30 మధ్య లక్ష్మీపూజ ఆచరించడానికి మంచి సమయమని పేర్కొంటున్నారు. ప్రదోష కాల సమయం సా.5.45-రా.8.15 మధ్య చేసే పూజలకు విశేషమైన ఫలితాలు ఉంటాయంటున్నారు.

దీపావళి పర్వదినాన కొన్ని ప్రత్యేక సంకేతాలు అదృష్టాన్ని, లక్ష్మీ అనుగ్రహాన్ని సూచిస్తాయని పండితులు చెబుతున్నారు. మహాలక్ష్మి వాహనమైన గుడ్లగూబను చూస్తే ఆర్థిక సమస్యలు తొలగిపోయి, సంపద వృద్ధి చెందుతుందని అంటున్నారు. అమ్మవారికి ప్రీతిపాత్రమైన తామర పువ్వును చూస్తే ధనవృద్ధి ఉంటుందంటున్నారు. కాకి కనిపించడం పూర్వీకుల ఆశీస్సులతో సమానమట. వీటితో పాటు ఆవులు, బల్లులను చూడటం కూడా శుభప్రదంగా పరిగణిస్తారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story