ఈ రోజుల్లో అసలు కోయకూడదు

Do Not Pluck Tulsi Leaves: తులసిని లక్ష్మీదేవి స్వరూపంగా, విష్ణువు యొక్క భార్యగా భావిస్తారు. ప్రతి హిందూ ఇంట్లో తులసి మొక్కను పెంచుతారు, రోజూ పూజిస్తారు. విష్ణువు, కృష్ణుడు, రాముడికి సమర్పించే ప్రసాదంలో తులసి ఆకు తప్పనిసరి.

కార్తీక మాసంలో తులసి మొక్కకు ఉత్సవంలా వివాహం చేస్తారు (తులసి కళ్యాణం). అలాంటి పవిత్రమైన ఈ తులసీ ఆకులను మహిళలు తెంపవచ్చా అనే సందేహం చాలా మందిలో ఉంది. అయితే సాధారణంగా మహిళలు తులసి ఆకులు తెంపవచ్చు.. కానీ కొన్ని నియమాలు , సాంప్రదాయాలను పాటించాల్సి ఉంటుంది.

ఈ రోజుల్లో తెంపకూడదు

ఏకాదశి, ద్వాదశి, చతుర్దశి, అమావాస్య, పౌర్ణమి, మరియు ఆదివారాల్లో, అలాగే సూర్యాస్తమయం తర్వాత తులసి ఆకులను తెంపకూడదు.

కొన్ని సంప్రదాయాల ప్రకారం, రుతుస్రావం సమయంలో మహిళలు తులసి మొక్కను తాకకూడదు లేదా ఆకులు తెంపకూడదు.

ఆకులను తెంపే ముందు తులసి మాతకు అనుమతి తీసుకున్నట్లుగా భావించాలి, గోళ్ళతో కాకుండా వేళ్ళ చివర్లతో సున్నితంగా తెంపాలి.

పూజ లేదా ఔషధ అవసరాల కోసం మాత్రమే ఆకులను తెంపడం మంచిది.

PolitEnt Media

PolitEnt Media

Next Story