పిల్లలకు చుట్టుకుంటాయా..?

Parents’ Sins and Virtues Affect Their Children: సాధారణంగా తల్లిదండ్రులు తమ పిల్లల కోసం ఆస్తులు, అంతస్తులు కూడబెట్టాలని తాపత్రయపడతారు. కానీ మనం ఇచ్చే ఆస్తితో పాటు మన కర్మ కూడా వారికి వారసత్వంగా వెళ్తుందని మీకు తెలుసా? తల్లిదండ్రులు చేసే పాపాలు లేదా పుణ్యాల ఫలాలు పిల్లలకు వర్తిస్తాయా..? అనే సందేహాలు చాలా మందిలో ఉంటాయి. అయితే తల్లిదండ్రుల నుండి పిల్లలకు కేవలం రక్తం, రూపం మాత్రమే కాదు, వారి కర్మ ఫలాలు కూడా అందుతాయి. ఏ విధంగా అయితే తండ్రి చేసిన అప్పులను కొడుకు తీర్చాల్సి ఉంటుందో, తండ్రి సంపాదించిన ఆస్తిని కొడుకు అనుభవిస్తాడో.. అదే విధంగా వారి పాపపుణ్యాల ప్రభావం కూడా పిల్లల జీవితాలపై ఉంటుంది.

ధర్మబద్ధమైన సంపద: తల్లిదండ్రులు కష్టపడి, ధర్మ మార్గంలో సంపాదించిన ఆస్తి పిల్లలకు సుఖసంతోషాలను, వృద్ధిని ఇస్తుంది.

అధర్మ సంపాదన: ఇతరులను మోసం చేసి, నిస్సహాయులను హింసించి లేదా అధిక వడ్డీలతో పీడించి సంపాదించిన సొమ్ము పిల్లలకు శాపంగా మారుతుంది. ఇది దీర్ఘకాలిక అనారోగ్యాలు, ఆర్థిక ఇబ్బందులు లేదా కోర్టు కేసుల రూపంలో తదుపరి తరాన్ని వేధిస్తుంది.

మనం ఏ కడుపులో పుడతామనేది ఎవరు నిర్ణయిస్తారు?

ఆధ్యాత్మిక శాస్త్రం ప్రకారం.. మన గత జన్మల కర్మ ఫలితాల ఆధారంగానే మనం ఒక నిర్దిష్టమైన దంపతులకు పిల్లలుగా పుడతాము. అంటే, తల్లిదండ్రుల పాపపుణ్యాలను పంచుకోవడానికి సిద్ధంగా ఉన్న ఆత్మలే ఆ కుటుంబంలో జన్మిస్తాయి. ధర్మం ద్వారా వచ్చే సంపద శుభాన్ని ఇస్తుంది.. అధర్మం ద్వారా వచ్చే సిరి అనర్థాలకు దారితీస్తుంది.

పిల్లల భవిష్యత్తు కోసం ఏం చేయాలి?

తమ పిల్లలు బాగుండాలని కోరుకునే తల్లిదండ్రులు కేవలం బ్యాంక్ బ్యాలెన్స్ పెంచితే సరిపోదని, పుణ్య బలాన్ని కూడా పెంచుకోవాలని పండితులు సూచిస్తున్నారు.

నిస్సహాయులకు సహాయం: ఎవరినీ మోసం చేయకుండా ఉండటం, పేదలకు సహాయం చేయడం వల్ల పుణ్యఫలం లభిస్తుంది.

ధర్మ మార్గం: సంపాదనలో కొంత భాగం దానధర్మాలకు కేటాయించడం వల్ల వంశంపై ఉన్న పితృదోషాలు లేదా పాప ఫలాలు తొలగిపోతాయి.

ప్రవర్తన: మన ప్రవర్తన మన తదుపరి తరంపై ప్రతికూల ప్రభావం చూపకుండా చూసుకోవడం మన బాధ్యత.

పిల్లల కోసం కోట్లు సంపాదించి ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ, వారు అనుభవించలేనంత 'పాపాన్ని' మాత్రం వారసత్వంగా ఇవ్వకూడదు. ధర్మ మార్గంలో నడుస్తూ, సత్కర్మలు ఆచరించడమే మనం మన పిల్లలకు ఇచ్చే నిజమైన ఆస్తి.

PolitEnt Media

PolitEnt Media

Next Story