Prayers Really Remove Problems: మానవ జీవితంలో కష్టసుఖాలు అనేవి ఒక నాణేనికి ఉన్న రెండు పార్శ్వాల వంటివి. అయితే సమస్యలు ఎదురైనప్పుడు చాలామంది మేము ఎన్ని పూజలు చేసినా కష్టాలు ఎందుకు తగ్గడం లేదు? అని ప్రశ్నిస్తుంటారు.

విధిని మార్చడం సాధ్యమేనా?

పూర్వజన్మ కర్మ ఫలాలను లేదా విధిని మార్చడం ఆ హరిహరాదులకు కూడా సాధ్యం కాదు. పుట్టిన ప్రతి మనిషి తన కర్మ ఫలాన్ని అనుభవించాల్సిందే. అయితే, పూజలు, హవనాలు, హోమాలు, జపాలు చేయడం వల్ల కష్టాలు పూర్తిగా మాయం కాకపోయినా, వాటిని తట్టుకునే ఆత్మస్థైర్యం, సహన శక్తి మనలో ఉద్భవిస్తాయి.

ప్రార్థన ఎలా ఉండాలి?

దేవుడిని ప్రార్థించేటప్పుడు "నా కష్టాలను తొలగించు" అని నేరుగా అడగడం కంటే, ఒక విలక్షణమైన మార్గాన్ని సూచించారు..

శక్తిని కోరండి: దేవా.. నేను ప్రస్తుతం చాలా ఇబ్బందుల్లో ఉన్నాను. నా కుటుంబంలో సమస్యలు ఉన్నాయి. ఈ కష్టాలను ధైర్యంగా అధిగమించే శక్తిని నాకు ప్రసాదించు అని వేడుకోవడమే సరైన పద్ధతి.

సానుకూలత: "మనానత్ త్రయతే ఇతి మంత్రః" అన్నట్లుగా, మంత్ర జపం చేసేటప్పుడు "నేను ఈ బాధల నుండి ఉపశమనం పొందుతున్నాను" అనే సానుకూల ఆలోచన మనసులో ఉండాలి.

బాహ్య పూజ కంటే మానసిక పూజ శ్రేష్ఠం:

మనం చేసే నిత్య పూజలు, అభిషేకాలు అవసరమే అయినప్పటికీ, వాటన్నింటికంటే మానసిక పూజ అత్యంత శక్తివంతమైనదని పండితులు వివరించారు. ఏ వస్తువుల అవసరం లేకుండా, కేవలం నిశ్చలమైన మనసుతో భగవంతుడిని స్మరించుకున్నా ఆయన అనుగ్రహం లభిస్తుంది. భక్తి అనేది మనం ఇతరుల కోసం చేసేది కాదు, మన అంతరాత్మ శుద్ధి కోసం మనం చేసుకునే సాధన.

కష్టాల సముద్రంలో పూజ ఒక ఓడ వంటిది:

జీవితం అనే సముద్రంలో కష్టాలు అలల వలె వస్తుంటాయి. ఈ అలలను దాటి గమ్యాన్ని చేరడానికి పూజ అనేది ఒక ఓడ లాగా పనిచేస్తుంది. మనం కష్టాలను పక్కన పెట్టి భగవంతుని నామస్మరణలో మునిగిపోయినప్పుడు, ఆ కష్టాలు మంచులా కరిగిపోతాయి. "యద్భవం తద్భవతి" అన్నట్లుగా మీ హృదయం ఎంత స్వచ్ఛంగా ఉంటే భగవంతుడు అంతగా ఆకర్షితుడవుతాడు.

Next Story