Shani Dosha: శని దోషాన్ని వదిలించుకోవడానికి ఇలా చేయండి..
వదిలించుకోవడానికి ఇలా చేయండి..

Shani Dosha: హిందూ మతంలో శని దేవుడిని న్యాయ దేవుడిగా భావిస్తారు. ఆయన ఆశీస్సులు జీవితంలో సుఖశాంతులు, శ్రేయస్సు, పురోగతిని తెస్తాయి. అయితే మీ జాతకంలో శని బలహీనమైన స్థితిలో ఉంటే, అది సాడే సతి, ధైయం, పితృ దోషం, పనిలో అడ్డంకులకు దారితీస్తుంది. అటువంటి సమయాల్లో శని చాలీసా పఠించడం చాలా ఫలవంతమైనదిగా పరిగణించబడుతుంది.
శని చాలీసా పఠనం యొక్క ప్రాముఖ్యత
తులసీదాస్ రచించిన హనుమాన్ చాలీసా లాగే, శని చాలీసా కూడా అత్యంత ప్రభావవంతమైనదిగా భావిస్తారు. ఇది శనిదేవుని శక్తిని, రూపాన్ని, ఆశీర్వాదాలను వివరిస్తుంది.
మత గ్రంథాల ప్రకారం.. శని చాలీసాను పారాయణం చేయడం వల్ల జాతకంలో శని గ్రహం శాంతించి జీవితంలో అడ్డంకులను తగ్గిస్తుంది.
ఎలా, ఎప్పుడు పారాయణం చేయాలి..?
శనివారం: శని దేవుడికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు శనివారం. ఈ రోజు ఆవ నూనెతో దీపం వెలిగించి.. చాలీసా జపించడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి.
విశ్వాసం, భక్తి: శని చాలీసాను పఠించేటప్పుడు స్వచ్ఛమైన మనస్సుతో, పూర్తి విశ్వాసం, భక్తితో ఉండాలి.
దానం: జపంతో పాటు, నల్ల నువ్వులు, ఆవాల నూనె, మినపప్పు, ఇనుము దానం చేయడం ద్వారా శని ఆశీస్సులు మరింత వేగంగా లభిస్తాయి.
పరిశుభ్రమైన ప్రదేశం: ఈ పారాయణాన్ని ఇంట్లో, ప్రార్థనా స్థలంలో లేదా శని ఆలయంలో పరిశుభ్రమైన వాతావరణంలో చేయాలి.
ని చాలీసా వల్ల కలిగే ప్రయోజనాలు
సాడే సతి, ధైయ నుండి ఉపశమనం.
వృత్తి, వ్యాపారాలలో ఎదురయ్యే అడ్డంకాలకు పరిష్కారం.
శత్రువుల భయం నుండి విముక్తి
మానసిక ప్రశాంతత, ఆత్మవిశ్వాసం.
జీవితంలో ఆర్థిక స్థిరత్వం, కుటుంబ సామరస్యం.
జోతిష్యుల ప్రకారం.. ప్రతి వ్యక్తి జాతకంలో శని ప్రభావం వేరుగా ఉంటుంది. అందువల్ల శని చాలీసా పఠనంతో పాటు, నల్ల కుక్క లేదా కాకికి ఆహారం పెట్టడం, రావి చెట్టును పూజించడం, శని ఆలయంలో నూనె సమర్పించడం వంటివి కూడా పాటించవచ్చని సూచిస్తున్నారు. ఈ చర్యల ద్వారా శనిదేవుని ఆశీస్సులు ఎల్లప్పుడూ మీపై ఉంటాయని నమ్ముతారు.
