ఈ చిన్న పరిహారాలతో విముక్తి పొందండి

Chandra Dosha in Your Horoscope: జ్యోతిషశాస్త్రం ప్రకారం చంద్రుడిని మనస్సు, భావోద్వేగాలు, మానసిక స్థితికి కారకుడిగా భావిస్తారు. మీ జాతకంలో చంద్రుడు బలహీనంగా ఉన్నా లేదా చంద్ర దోషం ఉన్నా.. జీవితంలో ఊహించని సమస్యలు ఎదురవుతాయి. ఆ దోషాలను ఎలా పోగొట్టుకోవాలో తెలుసుకోండి.. చంద్రుడు కర్కాటక రాశికి అధిపతి. జాతకంలో చంద్రుడు నీచస్థితిలో ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకోవడంలో తడబాటు, అనవసర ఖర్చులు, మానసిక అశాంతి వంటి సమస్యలు వేధిస్తాయి. వీటన్నింటికీ పరిష్కారం సాక్షాత్తు ఆ చంద్రుడిని శిరస్సున ధరించిన శివయ్య ఆరాధనలో ఉంది.

చంద్ర దోష నివారణకు అద్భుత పరిహారాలు:

పౌర్ణమి రోజున ఈ క్రింది పనులు చేయడం వల్ల చంద్రుడు బలపడి, జీవితంలో సానుకూల మార్పులు వస్తాయని పండితులు చెబుతున్నారు:

తెల్లటి వస్తువుల దానం: చంద్రునికి తెలుపు రంగు అంటే అత్యంత ఇష్టం. అందుకే ఈ రోజు బియ్యం, పిండి, పాలు, పెరుగు వంటి తెల్లటి వస్తువులను పేదలకు దానం చేయడం వల్ల దోష తీవ్రత తగ్గుతుంది.

వెండి ఆభరణాలు: వెండికి, చంద్రునికి అవినాభావ సంబంధం ఉంది. చంద్రుడు బలపడాలంటే వెండి ఉంగరాన్ని లేదా వెండి వస్తువులను ధరించడం మంచిది. ఇది మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది.

శివారాధన: పౌర్ణమి రోజున శివాలయానికి వెళ్లి రుద్రాభిషేకం చేయడం లేదా శివుడిని భక్తితో పూజించడం వల్ల చంద్ర దోషాలు త్వరగా తొలగిపోతాయి.

ప్రత్యేక దానం: ఈ రోజు శివాలయంలో బియ్యం, పిండితో పాటు చీపురును దానం చేయడం వల్ల విశేష ఫలితాలు ఉంటాయని, జీవితంలో ఆర్థిక ఇబ్బందులు తొలగి సానుకూలత పెరుగుతుందని నమ్ముతారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story