Follow This Tip to Attract Prosperity:హోలీ అంటే కేవలం రంగుల పండుగ మాత్రమే కాదు.. జీవితంలో ప్రతికూలతను తరిమికొట్టి, కొత్త శక్తిని నింపే ఒక అద్భుత సమయం. వాస్తు శాస్త్రం ప్రకా.. హోలీ వేడుకలకు ముందే మన ఇంటిని శుభ్రం చేసుకోవడం ఎంత ముఖ్యమో, ఇంట్లో పేరుకుపోయిన నెగటివ్ ఎనర్జీని వదిలించుకోవడం కూడా అంతే ముఖ్యం. మీ ఇంట్లో ఉన్న కొన్ని పాత వస్తువులే మీ ఆర్థిక ఎదుగుదలకు ఆటంకంగా మారుతున్నాయని వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

ఎండిపోయిన మొక్కలు.. ఎదుగుదలకు ఆటంకం

చాలామంది ఇంట్లో మొక్కలు పెంచుతుంటారు.. కానీ అవి ఎండిపోయినా లేదా చనిపోయినా అలాగే ఉంచుతారు. వాస్తు ప్రకారం.. ఎండిన మొక్కలు విచారానికి, ఇంట్లో అభివృద్ధి కుంటుపడటానికి సంకేతం. వాటి స్థానంలో తులసి లేదా మనీ ప్లాంట్ వంటి పచ్చని మొక్కలను ఉంచడం వల్ల సానుకూల శక్తి పెరుగుతుంది.

పాత బూట్లు.. కష్టాలకు దారితీస్తాయి..

ఇకపై ఉపయోగించని, చిరిగిపోయిన లేదా అరిగిపోయిన పాత బూట్లు, చెప్పులు ఇంట్లో ఉంచడం అశుభం. ఇవి జీవితంలో అనవసరమైన పోరాటాలను, కష్టాలను సూచిస్తాయి. అందుకే ఈ హోలీ లోపు వాటిని ఇంటి నుండి బయటకు పంపడం శ్రేయస్కరం.

పగిలిన అద్దాలు - విగ్రహాలు

ఇంట్లో శక్తి ప్రవాహం సాఫీగా సాగాలంటే, పగిలిన అద్దాలు లేదా గాజు వస్తువులను వెంటనే తొలగించాలి. ఇవి ఇంట్లో గొడవలకు కారణమవుతాయి. అలాగే, పూజ గదిలో విరిగిన దైవ విగ్రహాలు ఉంటే, వాటిని చెత్తబుట్టలో వేయకుండా గౌరవంగా ప్రవహించే నీటిలో నిమజ్జనం చేయాలి లేదా ఏదైనా చెట్టు మొదట్లో ఉంచాలి.

ఎలక్ట్రానిక్ వస్తువులు.. రాహువు ప్రభావం..

పనిచేయని మొబైల్ ఫోన్లు, టీవీలు లేదా ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను స్టోర్ రూమ్ లో దాచి ఉంచడం పెద్ద తప్పు. ఇవి రాహు గ్రహంపై చెడు ప్రభావాన్ని చూపిస్తాయి. దీనివల్ల ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని వాస్తు నిపుణులు చెబుతున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story