అంటే ఏంటో తెలుసా?

The Significance of Vaikuntha Ekadashi: దేవతలకు ఉత్తరాయణం పగలు, దక్షిణాయణం రాత్రి వేళగా చెబుతారు. ఈ మధ్యలో వచ్చే ధనుర్మాసం దేవతలకు బ్రహ్మీ సమయంగా పేర్కొంటారు. ఈ ముహూర్తంలో వచ్చే శుక్ల ఏకాదశి అత్యంత పవిత్రమైనది. దీనినే ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి అని పిలుస్తారు. ఈ ఏడాది డిసెంబర్ 30న వచ్చింది. ఆ రోజు మహా విష్ణువు మూడు కోట్ల దేవతలతో దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడని, ఉత్తరద్వారం నుంచి దర్శించుకుంటే సర్వపాపాలు తొలగిపోతాయని నమ్మకం.వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర ద్వార దర్శనం తెల్లవారుజామునే చేసుకోవడం శ్రేష్ఠమని పండితులు చెబుతున్నారు. ఏకాదశి తిథి రేపు ఉదయం 7:51కి మొదలై, ఎల్లుండి పొద్దున5:01 వరకు ఉంటుంది. శాస్త్రరీత్యా డిసెంబర్ 30నే వైకుంఠ ఏకాదశిగా పరిగణిస్తారు. అందువల్ల ఈ శుభ దినాన ఏ సమయంలో శ్రీనివాసుడిని దర్శించుకున్నా.. అనంతమైన పుణ్యఫలం లభిస్తుంది. భక్తితో చేసే ఈ దర్శనం అజ్ఞానాన్ని తొలగించి, మోక్ష మార్గాన్ని ప్రసాదిస్తుంది. కాగా వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో ఇవాళ అర్ధరాత్రి నుంచి వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభం కానున్నాయి. అర్ధరాత్రి 12.05 గంటలకు తిరుప్పావై పాశురాలతో ఆలయంలోని బంగారు వాకిలి తలుపులు తెరవనున్నారు. తొలుత 1.30AMకు VIP బ్రేక్ దర్శనాలను ప్రారంభిస్తారు. తెల్లవారుజామున 5.30కు ఈ-డిప్‌లో టోకెన్లు పొందిన వారిని అనుమతిస్తారు. జనవరి 8వ తేదీ వరకు సుమారు 7.7 లక్షల మందికి దర్శనం కల్పించేలా TTD ఏర్పాట్లు చేసింది.

PolitEnt Media

PolitEnt Media

Next Story