ఈ విషయాలు తెలుసా?

Facts About Chaganti Koteswara Rao: చాగంటి కోటేశ్వరరావు గారు తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ప్రజాదరణ పొందిన ఆధ్యాత్మిక ప్రవచనకర్త. ఆయన గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇక్కడ ఉన్నాయి. ఆయన నిరుపేద కుటుంబంలో జన్మించారు. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయారు. తన కుటుంబానికి పెద్ద దిక్కుగా భావించి, సరస్వతీ ఉపాసననే లక్ష్యంగా విద్యను అభ్యసించారు. పాఠశాల స్థాయి నుండి యూనివర్సిటీ వరకు గోల్డ్ మెడలిస్ట్‌గా నిలిచారు.ఆయన ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో మేనేజర్‌గా పనిచేశారు. 2018 ఆగస్టులో పదవీ విరమణ చేశారు. ఆయన తన ప్రవచనాలకు ఎటువంటి పారితోషికం తీసుకోరు, కేవలం ప్రయాణ ఖర్చులు మాత్రమే స్వీకరిస్తారు. ఆయన తండ్రి చాగంటి సుందర శివరావు, తల్లి సుశీలమ్మ. 1959 జూలై 14న జన్మించారు. సతీమణి సుబ్రహ్మణ్యేశ్వరి గారు వ్యవసాయ శాఖలో ఉన్నతాధికారిణిగా పని చేస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు - షణ్ముఖ చరణ్, నాగవల్లి. ఇద్దరూ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు..

ప్రవచన శైలి & ప్రత్యేకతలు:

ఆయన ధారణ శక్తి, జ్ఞాపకశక్తి అమోఘం.

మానవ ధర్మంపై ఆసక్తితో అష్టాదశ పురాణాలను అధ్యయనం చేసి, సామాన్యులకు సైతం అర్ధమయ్యే రీతిలో ప్రవచనాలను అందిస్తారు.

భాగవతం, రామాయణం, మహాభారతంతో పాటు వివిధ పురాణాలపై క్రమం తప్పకుండా ప్రవచనాలు ఇస్తారు. ఇవి రేడియో, టీవీ ఛానెళ్లలో ప్రసారం అవుతాయి. కొన్ని భక్తి టీవీ ఛానెళ్లు ఆయన ప్రసారాల కోసం ప్రత్యేక స్లాట్‌లను కేటాయిస్తాయి.

ఆయన 42 రోజుల్లో రామాయణం, 42 రోజుల్లో భాగవతం, 30 రోజుల్లో శివ పురాణం, 2-3 నెలల్లో శ్రీ లలితా సహస్ర నామం పూర్తి చేసిన ఘనులు.

గతంలో 2016లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సాంస్కృతిక సలహాదారుగా పనిచేశారు. ఇటీవల (2024లో) ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం విద్యార్థుల్లో విలువలు, నైతికత పెంపొందించడానికి ప్రభుత్వ సలహాదారుగా (క్యాబినెట్ హోదాతో) నియమించింది. ఆయన కాకినాడలో స్థిరపడి గోశాలను నిర్వహిస్తున్నారు. ప్రవచనాల కోసం బయటకి వెళ్ళినప్పుడు తప్ప, నిత్యం గోశాలలో గోవులకు సేవ చేస్తుంటారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story