దీపం వెలిగిస్తే ఏమవుతుందో తెలుసా..?

Light a Lamp Near the Tulsi Plant in the Evening: హిందూ ధర్మంలో శతాబ్దాలుగా వస్తున్న ఆచారాలలో ఒకటి.. ప్రతి సాయంత్రం తులసి మొక్క దగ్గర దీపం వెలిగించడం. ఈ ఆచారం కేవలం పూజా విధానం మాత్రమే కాదు, జ్యోతిషశాస్త్రం, వాస్తు శాస్త్రం పరంగా కూడా ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంది. సాయంత్రం వేళ తులసి వద్ద దీపం పెట్టడం వల్ల కలిగే ప్రయోజనాలు, ఆధ్యాత్మిక నమ్మకాల గురించి తెలుసుకుందాం.

దీపం వెలిగించడం వెనుక ఉన్న కారణాలు

తులసిని పూజించడం వెనుక బలమైన నమ్మకాలు ఉన్నాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. తులసి దగ్గర దీపం పెట్టడం వల్ల కలిగే ఐదు ముఖ్య ప్రయోజనాలు ఇవి:

సానుకూల శక్తి పెరుగుదల:

ప్రతి సాయంత్రం తులసి వద్ద దీపం వెలిగించడం ద్వారా ఇంట్లోకి సానుకూల శక్తి ప్రవాహం పెరుగుతుంది. ఇది ఇంటి వాతావరణాన్ని శుద్ధి చేసి, ప్రతికూల శక్తిని తొలగిస్తుంది. ఫలితంగా, కుటుంబంలో ఆనందం, ప్రశాంతత నెలకొంటాయి.

లక్ష్మీదేవి, విష్ణువుల అనుగ్రహం:

హిందూ విశ్వాసాల ప్రకారం, తులసి మొక్కలో లక్ష్మీదేవి నివసిస్తుంది. తులసిని విష్ణువుకు అత్యంత ప్రియమైనదిగా భావిస్తారు. ప్రతిరోజూ తులసిని పూజించి, దీపం పెట్టడం వల్ల లక్ష్మీదేవి, విష్ణువు ఇద్దరి ఆశీస్సులు లభిస్తాయి. దీంతో జీవితంలోని పెండింగ్‌ పనులు పూర్తవుతాయి.

మానసిక ప్రశాంతత:

ఒత్తిడి లేదా అధిక ఆలోచనలతో బాధపడుతున్న వారికి సాయంత్రం తులసి వద్ద దీపం వెలిగించడం మంచి పరిష్కారం. ఈ ఆచారం అపారమైన మనశ్శాంతిని అందించి, ఒత్తిడిని క్రమంగా తగ్గిస్తుంది.

ఆనందం - శ్రేయస్సు

సాయంత్రం దీపం పెట్టడం వల్ల ఇంట్లో ఆనందం - శ్రేయస్సు పెరుగుతాయి. ఇది ఇంటికి అదృష్టాన్ని తీసుకొచ్చి, ప్రతి మూల ఆనందంతో నిండిపోయేలా చేస్తుందని.. తద్వారా ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోతాయని నమ్మకం.

ఆత్మ శుద్ధి

నిరంతరం ఈ ఆచారాన్ని పాటించడం వల్ల అంతర్గత శాంతి, విశ్రాంతి లభిస్తాయి. ఇది ఆత్మను, ఆలోచనలను శుద్ధి చేస్తుంది. అయితే దీపం వెలిగించేటప్పుడు ఎటువంటి ప్రతికూల ఆలోచనలు రాకుండా జాగ్రత్త వహించాలని పెద్దలు సూచిస్తారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story