Swan Picture at Home: ఇంట్లో హంసల చిత్రం ఏ దిక్కు పెడితే మంచి జరుగుతుందో తెలుసా..?
ఏ దిక్కు పెడితే మంచి జరుగుతుందో తెలుసా..?

Swan Picture at Home: మనం నివసించే ఇంట్లో ప్రతి వస్తువు ఒక రకమైన శక్తిని విడుదల చేస్తుంది. వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంట్లో కొన్ని పవిత్రమైన చిత్రాలు లేదా విగ్రహాలను ఉంచడం వల్ల నెగటివ్ ఎనర్జీ తొలగిపోయి, అదృష్టం వరిస్తుంది. అలాంటి వాటిలో హంస చిత్రం లేదా విగ్రహం చాలా ముఖ్యమైనది.హంస పవిత్రతకు, జ్ఞానానికి, ప్రేమకు చిహ్నం. మీ ఇంట్లో హంసల చిత్రాన్ని ఏ దిశలో ఉంచాలి? దానివల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
తూర్పు దిశే శుభప్రదం
మీరు ఇంటి హాలులో లేదా డ్రాయింగ్ రూమ్‌లో హంసల చిత్రాన్ని ఉంచాలనుకుంటే దానిని తూర్పు వైపు గోడపై ఉంచడం అత్యంత శుభప్రదమని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఇది ఇంట్లోకి సానుకూల శక్తిని ఆహ్వానిస్తుంది.
ఆర్థిక లాభం, కెరీర్‌లో పురోగతి
వ్యాపారంలో లాభాలు గడించాలన్నా లేదా ఉద్యోగంలో ప్రమోషన్ రావాలన్నా, కార్యాలయంలో లేదా డ్రాయింగ్ రూమ్‌లో ఒక జత హంసల చిత్రాన్ని ఉంచండి. ఇది మీ పనిలో వచ్చే అడ్డంకులను తొలగించి, విజయం వైపు నడిపిస్తుంది.
వైవాహిక జీవితంలో మధురమైన బంధం
భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నా లేదా ఉద్రిక్తతలు ఉన్నా.. మీ బెడ్ రూమ్‌లో ఒక జత హంసల ఫోటోను ఉంచుకోండి. ఇది దంపతుల మధ్య ప్రేమను పెంచి, వైవాహిక జీవితాన్ని సుఖమయంగా మారుస్తుంది.
పిల్లల చదువుల్లో రాణించాలంటే..
హంస జ్ఞానదేవత అయిన సరస్వతి దేవి వాహనం. అందుకే పిల్లల స్టడీ రూమ్‌లో లేదా వారి స్టడీ టేబుల్‌పై హంస విగ్రహాన్ని ఉంచడం వల్ల..
పిల్లల్లో ఏకాగ్రత పెరుగుతుంది.
చదువుపై ఆసక్తి కలిగి పరీక్షల్లో మంచి ఫలితాలు సాధిస్తారు.
ఇంట్లో విద్యావంతులకు, జ్ఞానానికి ఎప్పుడూ కొరత ఉండదు.
నెగటివ్ ఎనర్జీకి చెక్
ఇంట్లో ఎప్పుడూ ఏదో తెలియని అశాంతిగా ఉంటే, హంసల చిత్రం ప్రతికూల శక్తిని హరించివేస్తుంది. మనసును ప్రశాంతంగా ఉంచి, కుటుంబ సభ్యుల మధ్య సఖ్యతను పెంచుతుంది.

