Papaya Tree: ఇంటి ముందు బొప్పాయి చెట్టు ఎందుకు ఉండకూడదో తెలుసా..?
బొప్పాయి చెట్టు ఎందుకు ఉండకూడదో తెలుసా..?

Papaya Tree: వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ఆవరణలో కొన్ని రకాల మొక్కలను పెంచడం వల్ల ప్రతికూల ఫలితాలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అటువంటి మొక్కలలో బొప్పాయి ఒకటి. ఇంటి ముందు బొప్పాయి మొక్క ఉండటం అస్సలు మంచిది కాదని వాస్తు నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
ఇంటి ముందు అనుకోకుండా బొప్పాయి మొక్క పెరిగితే.. దాన్ని వెంటనే పెకిలించి వేరే చోట నాటాలని వాస్తు నిపుణులు సలహా ఇస్తున్నారు.
బొప్పాయి మొక్కతో ప్రతికూలతలు:
బొప్పాయి మొక్కను ఇంటి ముందు నాటడం వల్ల కింది ప్రతికూలతలు కలుగుతాయని వాస్తు నిపుణులు అంటున్నారు:
* శాంతి, ఆనందం దూరం: మీ ఇంటి ముందు బొప్పాయి చెట్టును నాటితే, ఆ ఇంట్లో శాంతి, ఆనందం
దూరమవుతాయని చెబుతారు. అందుకే దీనిని అశుభ సంకేతంగా భావిస్తారు.
* ఆర్థిక ఇబ్బందులు: ఇంటి ఆవరణలో బొప్పాయి చెట్టు ఉంటే, ఇంట్లో ఎప్పుడూ ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయని నమ్ముతారు.
* కుటుంబ వివాదాలు: దీనితో పాటు, ఇంట్లో ఎప్పుడూ గొడవలు, చికాకులు ఉంటాయని వాస్తు నిపుణులు అంటున్నారు.
* పిల్లలకు కష్టాలు: ఇంటి ముందు లేదా పెరట్లో బొప్పాయి మొక్క ఉండటం వల్ల ఇంట్లోని పిల్లలకు దుఃఖం, కష్టాలు కలుగుతాయని కూడా నమ్ముతారు.
బొప్పాయి మొక్కను పూర్వీకుల నివాసంగా భావించడం వల్ల,
ఇంటి దగ్గర లేదా ఇంటి ముందు దానిని నాటకూడదని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. కాబట్టి వాస్తు దోషాలు నివారించడానికి ఇంటి ముందు బొప్పాయి మొక్కను పెంచకపోవడం ఉత్తమం.
