Never Donate These 4 Items: దానధర్మాలు చేస్తున్నారా..? ఈ 4 వస్తువులను అస్సలు ఇవ్వొద్దు..!
ఈ 4 వస్తువులను అస్సలు ఇవ్వొద్దు..!

Never Donate These 4 Items: పండుగలు, ఉపవాసాలు ముగిసిన తర్వాత దానధర్మాలు చేయడం హిందూ సంప్రదాయంలో చాలా ముఖ్యమైనది. పుణ్యం వస్తుందని మనం దానం చేస్తాం. కానీ వాస్తు శాస్త్రం ప్రకారం.. కొన్ని వస్తువులను పొరపాటున కూడా దానం చేయకూడదు. అలా చేస్తే పుణ్యం పోవడమే కాదు.. ఇంట్లో ఆర్థిక సమస్యలు, దురదృష్టం వెంటాడతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మరి వాస్తు ప్రకారం ఎవరికీ ఇవ్వకూడని ఆ ముఖ్యమైన వస్తువులు ఏంటో ఇప్పుడు చూద్దాం..
1. నూనె, ఉప్పు
ఏదైనా ఉపవాసం పూర్తి కాగానే నూనె లేదా ఉప్పును అస్సలు దానం చేయకూడదు. ఈ వస్తువులు దానం చేస్తే, మీరు చేసిన ఉపవాసం పుణ్యం మొత్తం పోతుందని వాస్తు చెబుతోంది. దీనివల్ల ఆర్థిక నష్టం, ఇంట్లో అనారోగ్య భయం పెరుగుతాయని అంటారు.
2. మిగిలిపోయిన ఆహారం
మీ ఇంట్లో మిగిలిపోయిన లేదా పాడైపోయిన ఆహారాన్ని యాచకులకు లేదా ఎవరికీ దానం చేయకూడదు. మిగిలిపోయిన ఆహారం ఇవ్వడం వల్ల ఇంట్లో ధనం రాక ఆగిపోతుంది.దీనివల్ల పేదరికం, అనారోగ్యం, దుఃఖం వస్తాయని చెబుతారు. దానం చేసే ఆహారం ఎప్పుడూ తాజాగా, శుభ్రంగా ఉండాలి.
3. చీపురు
చీపురును ఎవరికీ దానం చేయకూడదు. చీపురును లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు. చీపురును వేరొకరికి ఇవ్వడం అంటే మీ ఇంట్లో ఉన్న సంపదను వారికే ఇచ్చేసినట్లు అవుతుంది. దీనివల్ల ఆర్థిక నష్టం తప్పదని వాస్తు నిపుణులు అంటున్నారు.
4. మతపరమైన పుస్తకాలు
మీ ఇంటికి వచ్చిన వారికి మతపరమైన గ్రంథాలు లేదా పవిత్ర పుస్తకాలను దానం చేయవద్దు. గ్రహీత ఆ పుస్తకాలను పవిత్రంగా ఉంచకపోయినా, చదవకపోయినా... దాని పాపం దానం చేసిన వారికే తగులుతుందని అంటారు. దీనివల్ల మీ జీవితంలో అడ్డంకులు, ప్రయత్నాలలో వైఫల్యాలు ఎదురయ్యే అవకాశం ఉంది.
దానధర్మాలు చేసేటప్పుడు ఈ నాలుగు వస్తువులను పక్కన పెట్టి.. తాజా, విలువైన వస్తువులను మాత్రమే ఇవ్వడం శ్రేయస్కరం.
