రూ.9 కోట్లు విరాళం

TTD: అమెరికాకు చెందిన‌ ప్ర‌వాస భార‌తీయుడు శ్రీ మంతెన రామలింగ‌రాజు త‌న కుమార్తె శ్రీమ‌తి మంతెన నేత్ర‌, అల్లుడు శ్రీ వంశీ గాదిరాజుల‌ పేరు మీదుగా తిరుమ‌ల‌లోని యాత్రికుల వ‌స‌తి స‌ముదాయాల ఆధునీక‌ర‌ణ‌కు గాను టీటీడీకి బుధ‌వారం రూ.9 కోట్లు విరాళంగా అందించారు.

ఈ సంద‌ర్భంగా టీటీడీ చైర్మ‌న్ తిరుమ‌ల‌లోని ప‌ద్మావ‌తి అతిథి గృహంలో మీడియా స‌మావేశం నిర్వ‌హించి దాత‌ను అభినందించారు. శ్రీ మంతెన రామ‌రాజు 2012 లో కూడా టీటీడీకి రూ.16.06 కోట్లు విరాళంగా ఇచ్చార‌ని చెప్పారు. తిరుమ‌లలో భ‌క్తుల‌కు మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న‌లో త‌న వంతు స‌హ‌కారం అందించేందుకు ముందుకు వ‌చ్చిన ఆయ‌న‌కు చైర్మ‌న్ అభినంద‌న‌లు తెలిపారు. భ‌విష్య‌త్తులో టీటీడీకి మ‌రిన్ని విరాళాలు అందిస్తార‌ని అశిస్తున్న‌ట్లు తెలియ‌జేశారు.

ఈ కార్య‌క్ర‌మంలో విజ‌య న‌గ‌రం ఎంపీ శ్రీ క‌లిశెట్టి అప్ప‌ల నాయుడు, టీటీడీ అద‌న‌పు ఈవో శ్రీ సి.హెచ్‌.వెంక‌య్య చౌద‌రి, త‌దిత‌రులు పాల్గొన్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story