Dwidasha Yoga 2026: ద్విదాశ యోగం 2026: జూలై 7 నుండి ఈ 4 రాశుల వారికి అదృష్ట కాలం, పెరగనున్న బ్యాంక్ బ్యాలెన్స్..
బ్యాంక్ బ్యాలెన్స్..

Dwidasha Yoga 2026: జ్యోతిష్యశాస్త్రంలో గ్రహాల మార్పులు, నక్షత్ర సంచారానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. గ్రహాల రాజకుమారుడైన బుధుడు తన రాశిని మార్చుకోబోతున్నాడు. జూలై 7న బుధుడు కర్కాటక రాశి నుండి వక్రగమనంలో తన సొంత రాశి అయిన మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. బుధుడి ఈ రాశి మార్పు వల్ల జ్యోతిష్యశాస్త్రంలో అత్యంత అరుదైన ద్విదాశ యోగం ఏర్పడబోతోంది. ఈ గ్రహాల కలయిక వల్ల కొన్ని రాశుల వారికి అదృష్ట ద్వారాలు తెరుచుకోనున్నాయి. ముఖ్యంగా ఈ క్రింది 4 రాశుల వారికి ఆర్థికంగా, వృత్తిపరంగా భారీ ప్రయోజనాలు కలగబోతున్నాయి.
లబ్ధి పొందనున్న ఆ 4 అదృష్ట రాశులు
మిథున రాశి
బుధుడి సంక్రమణం మిథున రాశిలోనే జరుగుతుండటం వల్ల ఈ రాశి వారికి అత్యధిక ప్రయోజనాలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు ఆఫీసులో బాధ్యతలు పెరుగుతాయి. ఉన్నతాధికారుల నుండి ప్రశంసలు, మద్దతు లభిస్తాయి. కొత్త ఆదాయ వనరులు లభిస్తాయి. గతంలో ఎక్కడైనా నిలిచిపోయిన డబ్బు ఈ కాలంలో తిరిగి మీ చేతికి అందుతుంది.
కన్యా రాశి
కన్యా రాశికి అధిపతి బుధుడే కావడం వల్ల ఈ రాశి మార్పు వీరికి అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. ఉద్యోగ మార్పు లేదా ప్రమోషన్ కోసం ప్రయత్నిస్తున్న వారికి ఇది అనుకూలమైన సమయం. వ్యాపారస్తులు కొత్త భాగస్వామ్యాలు లేదా వ్యాపారాలు ప్రారంభించడానికి ఇది ఉత్తమ సమయం. విదేశీ వ్యాపారాల ద్వారా భారీ లాభాలు పొందుతారు.
తులా రాశి
తులా రాశి వారికి ఈ కాలం చాలా సానుకూల ఫలితాలను తెచ్చిపెడుతుంది. పూర్వీకుల ఆస్తి లేదా పాత పెట్టుబడుల నుండి అకస్మాత్తుగా మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. మీ మాట తీరు, కమ్యూనికేషన్ స్కిల్స్ మెరుగుపడతాయి. దీనివల్ల సమాజంలో, కార్యాలయంలో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అధికారుల ఆదరాభిమానాలు పొందుతారు.
ధనూ రాశి
ధనూ రాశి వారికి ఈ యోగం లక్ష్మీ కటాక్షాన్ని కలిగిస్తుంది. ఆర్థికంగా స్థిరత్వం ఏర్పడుతుంది. బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. వ్యాపారంలో ఆశించిన దానికంటే ఎక్కువ లాభాలు వస్తాయి. వైవాహిక జీవితంలో చాలా కాలంగా వేధిస్తున్న సమస్యలు తొలగిపోతాయి. కోర్టు కేసుల ఫలితాలు మీకు అనుకూలంగా వచ్చే అవకాశం ఉంది.

