Eating While Sitting on the Bed: మంచం మీద కూర్చుని తింటున్నారా? అయితే లక్ష్మీదేవి మీ ఇంటిని వదిలి వెళ్లడం ఖాయం..
అయితే లక్ష్మీదేవి మీ ఇంటిని వదిలి వెళ్లడం ఖాయం..

Eating While Sitting on the Bed: ప్రస్తుత ఆధునిక జీవనశైలిలో చాలామందికి అలవాటైన పని.. బెడ్ మీద కూర్చుని భోజనం చేయడం. ల్యాప్‌టాప్‌లో సినిమా చూస్తూనో లేదా మొబైల్ స్క్రోల్ చేస్తూనో మంచం మీద తింటే వచ్చే ఆనందం వేరని చాలామంది భావిస్తారు. అయితే ఈ చిన్న అలవాటు మీ జీవితాన్ని ఎంతలా ప్రభావితం చేస్తుందో మీకు తెలుసా? మన సనాతన సంప్రదాయంలో ఆహారాన్ని పరబ్రహ్మ స్వరూపంగా భావిస్తారు. అన్నదాతా సుఖీభవ అంటూ అన్నపూర్ణేశ్వరిని పూజిస్తాము. భగవద్గీతలో చెప్పినట్లుగా, ప్రాణికోటి మనుగడకు అన్నమే ప్రధానం. అటువంటి పవిత్రమైన ఆహారాన్ని మనం ఎక్కడ కూర్చుని తింటున్నాం అనే అంశం మన ఆరోగ్యం, ఐశ్వర్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది.
మంచం మీద భోజనం.. ఎందుకు చేయకూడదు?
వాస్తు, జ్యోతిష్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మంచం మీద కూర్చుని అన్నం, నీరు, కాఫీ లేదా స్నాక్స్ తీసుకోవడం వల్ల కింది ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది:
లక్ష్మీదేవి ఆగ్రహం: మంచం పడుకోవడానికి ఉద్దేశించినది. అక్కడ భోజనం చేయడం వల్ల ఇంటికి ఐశ్వర్యాన్ని ఇచ్చే మహాలక్ష్మి ఆగ్రహానికి గురవుతాము. దీనివల్ల ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు మొదలవుతాయి.
గ్రహ దోషాలు: మంచం మీద తింటే జాతకంలోని తొమ్మిది గ్రహాలు ప్రతికూలంగా మారుతాయని, దీనివల్ల దైవానుగ్రహం లభించదని శాస్త్రాలు చెబుతున్నాయి.
జ్ఞాపకశక్తిపై ప్రభావం: విద్యార్థులు లేదా చిన్నపిల్లలు మంచం మీద కూర్చుని తింటే వారి ఏకాగ్రత దెబ్బతింటుంది, జ్ఞాపకశక్తి తగ్గుతుంది.
ప్రతికూల శక్తి : మంచం మీద తినడం వల్ల ఇంట్లో సానుకూలత తగ్గి, అనవసరమైన గొడవలు, కోపం, మనస్పర్థలు, మానసిక ఒత్తిడి పెరుగుతాయి.
వ్యాపారంలో నష్టాలు: వ్యాపారవేత్తలు ఈ అలవాటును కలిగి ఉంటే, వారి వ్యాపారంలో ఊహించని నష్టాలు లేదా ఆటంకాలు ఎదురయ్యే ప్రమాదం ఉంది.
సరైన పద్ధతి ఏమిటి?
ఆహారాన్ని గౌరవించడం అంటే మనల్ని మనం గౌరవించుకోవడమే. సాధ్యమైనంత వరకు నేలపై కూర్చుని లేదా డైనింగ్ టేబుల్ వద్ద ప్రశాంతమైన మనస్సుతో భోజనం చేయడం ఉత్తమం. ఆహారం తినేటప్పుడు టీవీ లేదా మొబైల్ చూడకుండా, కేవలం భోజనం మీద మాత్రమే దృష్టి పెట్టడం వల్ల ఆ శక్తి మన శరీరానికి పూర్తిస్థాయిలో అందుతుంది.

