కానీ కొనేముందు జాగ్రత్త.. అసలైనదా కాదా అని ఇలా గుర్తించండి..

Ekamukhi Rudraksha for Sun Dosha Relief: ప్రస్తుత కాలంలో ఆధ్యాత్మిక, ఆరోగ్య కారణాల వల్ల రుద్రాక్షలకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. అయితే ఇదే అదృశ్యంగా భావించి కొందరు కేటుగాళ్లు నకిలీ రుద్రాక్షలను విక్రయిస్తూ భక్తులను మోసగిస్తున్నారు. ముఖ్యంగా అత్యంత అరుదైన ఏకముఖ రుద్రాక్ష విషయంలో జాగ్రత్తగా ఉండాలని జ్యోతిష్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఏకముఖ రుద్రాక్ష విశిష్టత:

పురాణాల ప్రకారం, ఏకముఖ రుద్రాక్షను సాక్షాత్తూ పరమశివుని స్వరూపంగా భావిస్తారు.

సూర్యగ్రహ దోష నివారణ: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఈ రుద్రాక్షకు సూర్య గ్రహంతో సంబంధం ఉంటుంది. జాతకంలో సూర్యుడు బలహీనంగా ఉన్నవారు, ముఖ్యంగా సింహ రాశి వారు దీనిని ధరించడం వల్ల అద్భుతమైన శుభ ఫలితాలను పొందవచ్చు.

మోక్ష మార్గం: ఆధ్యాత్మిక ప్రయాణంలో ఉన్నవారికి, మోక్షం పొందాలనుకునే వారికి ఇది ఒక దివ్యౌషధంలా పనిచేస్తుంది.

ఆరోగ్య - మానసిక ప్రయోజనాలు:

కేవలం ఆధ్యాత్మికంగానే కాకుండా, ఆరోగ్య పరంగా కూడా దీనికి విశేష గుర్తింపు ఉంది:

గుండె ఆరోగ్యం: రక్తపోటు, గుండె సంబంధిత సమస్యలతో బాధపడేవారికి ఇది మేలు చేస్తుంది.

మానసిక ప్రశాంతత: దీనిని ధరించడం వల్ల ఆత్మవిశ్వాసం పెరిగి, మనస్సు ప్రశాంతంగా మారుతుంది.

విద్యార్థులకు: ఏకాగ్రత, జ్ఞాపకశక్తిని పెంచుకోవాలనుకునే విద్యార్థులకు ఏకముఖ రుద్రాక్ష ఎంతో ప్రయోజనకరం.

అసలైన రుద్రాక్షను గుర్తించడం ఎలా?:

నకిలీల బారిన పడకుండా ఉండటానికి ఈ క్రింది పరీక్షలు చేసి చూడండి

ఆకారం: నిజమైన ఏకముఖ రుద్రాక్ష సాధారణంగా నెలవంక* ఆకారంలో లేదా గోళాకారంలో ఉంటుంది. దీనిపై పై నుండి క్రింది వరకు ఒకే ఒక స్పష్టమైన గీత ఉంటుంది.

నీటి పరీక్ష: రుద్రాక్షను నీటిలో వేసినప్పుడు అది వెంటనే మునిగిపోవాలి. అలాగే, నీటిలో వేసి మరిగించినప్పుడు దాని రంగు మారకూడదు. ఒకవేళ రంగు వెలిసిపోతే అది నకిలీదని గ్రహించాలి.

నూనె పరీక్ష: రుద్రాక్షను నీలమణి నూనెలో ఉంచినప్పుడు అది మునుపటి కంటే ఎక్కువ ప్రకాశవంతంగా మెరిస్తే, అది అసలైన రుద్రాక్ష అని అర్థం.

రుద్రాక్ష అనేది కేవలం ఆభరణం కాదు, అది ఒక దైవిక శక్తి. కాబట్టి దానిని కొనుగోలు చేసేటప్పుడు నమ్మకమైన సంస్థలను ఆశ్రయించడం మరియు పైన పేర్కొన్న పరీక్షలు నిర్వహించడం ద్వారా మోసపోకుండా ఉండవచ్చు.

PolitEnt Media

PolitEnt Media

Next Story