Evil Eye or Financial Troubles: దిష్టి తగిలిందా? ఆర్థిక ఇబ్బందులు వేధిస్తున్నాయా? ఈ ఉప్పు చిట్కాలతో అద్భుత ఫలితాలు..
ఈ ఉప్పు చిట్కాలతో అద్భుత ఫలితాలు..

Evil Eye or Financial Troubles: మన చుట్టూ ఉండే ప్రతికూల ప్రకంపనలను గ్రహించి, సానుకూలతను పెంచే గుణం ఉప్పుకు ఉంది. అందులోనూ అత్యంత స్వచ్ఛమైనదిగా భావించే సైంధవ ఉప్పుతో చేసే పరిహారాలు త్వరగా ఫలితాలను ఇస్తాయని నిపుణులు చెబుతున్నారు.
దృష్టి దోష నివారణకు
పిల్లలకు లేదా పెద్దలకు దిష్టి తగిలినప్పుడు, ఒక గుప్పెడు సైంధవ ఉప్పును తీసుకుని బాధితుడి తల చుట్టూ ఏడుసార్లు తిప్పి, ఆపై దానిని నీటిలో వేయాలి. ఇలా చేయడం వల్ల వారిపై ఉన్న చెడు దృష్టి ప్రభావం తొలగిపోతుంది. అలాగే పిల్లల గదుల్లో ఒక గాజు పాత్రలో సైంధవ ఉప్పును ఉంచడం వల్ల అక్కడ ప్రతికూల శక్తి చేరకుండా ఉంటుంది.
కుటుంబ కలహాలు - నైరుతి దిశ పరిహారం
ఇంట్లో తరచూ గొడవలు జరుగుతుంటే, శనివారం లేదా గురువారం నాడు ఒక గిన్నెలో నీటిని తీసుకుని అందులో ఉప్పు వేయాలి. ఈ గిన్నెను ఇంటి నైరుతి మూలలో ఉంచాలి. ప్రతి వారం ఈ నీటిని మారుస్తూ ఉంటే కుటుంబంలో ప్రశాంతత, ఆనందం నెలకొంటాయి.
వ్యాపారంలో నష్టాలు ఉంటే
వ్యాపారం సరిగ్గా సాగకపోయినా లేదా నష్టాలు వస్తున్నా.. ఒక ఎర్రటి వస్త్రంలో ఉప్పు ముక్కను కట్టి మీ ఆఫీసులో లేదా షాపులో నగదు ఉంచే చోట వేలాడదీయండి. ఇలా చేయడం వల్ల వ్యాపార వృద్ధి చెందుతుందని నమ్ముతారు.
ఆర్థిక ఇబ్బందులు - దాంపత్య సమస్యలు:
ధన వృద్ధి: ఆర్థిక ఇబ్బందులు తొలగాలంటే ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఉప్పు కలిపిన నీటిని చల్లడం శుభప్రదం.
భార్యాభర్తల బంధం: దంపతుల మధ్య గొడవలు వస్తుంటే, బెడ్‌రూమ్‌లో ఒక చిన్న సైంధవ ఉప్పు ముక్కను ఉంచడం వల్ల సంబంధాలు మెరుగుపడి, వారి మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది.
ఎందుకు సింధవ ఉప్పు?
సాధారణ ఉప్పుతో పోలిస్తే సైంధవ ఉప్పు సహజ సిద్ధంగా లభిస్తుంది. దీనికి నెగటివ్ ఎనర్జీని పీల్చుకునే శక్తి ఎక్కువగా ఉంటుంది. అందుకే దీనిని ఇంటిని శుద్ధి చేసే ప్రక్రియలో ఎక్కువగా ఉపయోగిస్తారు.

