Naradshishti: నరదృష్టితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారా..? ఇలా చేయండి..
ఇలా చేయండి..

Naradshishti: ఇంట్లో మంచి పూజలు చేసినా కుటుంబంపై నరదృష్టి ప్రభావం పడుతోందా? అనారోగ్యం, ఆర్థిక సమస్యలు, కుటుంబ కలహాలు, పిల్లల ఆరోగ్యం క్షీణించడం వంటి ప్రతికూల ప్రభావాలను గమనిస్తున్నారా? అయితే దీనికి పండితులు ప్రభావవంతమైన పరిష్కారాన్ని సూచించారు.
పద్ధతి ఏమిటి?
ఈ పద్ధతి చాలా సులభం, పెద్దగా ఖర్చు లేదా సంక్లిష్టమైన విధానాలు అవసరం లేదు. దీనిని ఇంటి యజమాని లేదా గృహిణి నిర్వహించవచ్చు. పిల్లలను మాత్రం దీన్ని చేయనివ్వకూడదు.
1. ఒక నిమ్మకాయను సగానికి కోయాలి.
2. ఒక భాగానికి పసుపు, మరొక భాగానికి కుంకుమ పూయాలి.
3. తరువాత పసుపు లేదా కుంకుమ ఉన్న భాగాలపై మూడు లేదా ఐదు రాతి ఉప్పు పలుకులను ఉంచాలి.
4. మంగళవారం లేదా శుక్రవారం సాయంత్రం 6:30, 8:30 మధ్య, నిమ్మకాయ భాగాలను రెండు చేతుల్లో పట్టుకుని ఇంటి ప్రధాన ద్వారం (సింహద్వారం) దగ్గర ఏడుసార్లు తిప్పాలి.
మంత్ర జపం
ఈ ప్రక్రియలో వీలైతే, “సర్వదుష్ట గ్రహ నివారకాయ స్వాహా” లేదా “సర్వదుష్ట గ్రహ పీడ నివారకాయ కురుకురు స్వాహా” అనే మంత్రాన్ని జపించవచ్చు.
ఏం చేయాలి?
నిమ్మకాయతో ఏడు సార్లు దిష్టి తీసిన తర్వాత, దానిని నేరుగా చేతులతో తాకకుండా కాగితంలో చుట్టి, ఏదైనా మొక్క కింద లేదా ప్రవహించే నీటిలో వేయాలి. ఎట్టిపరిస్థితుల్లోనూ ఇతరులకు ఇవ్వకూడదు లేదా చెత్తబుట్టలో వేయకూడదు.
ఈ పద్ధతిని ఒక మంగళవారం, ఒక శుక్రవారం మరొక మంగళవారం.. మొత్తం మూడు రోజులు పునరావృతం చేయడం ఉత్తమం. ఇది హోమం చేసినంత మంచి ఫలితాలను ఇస్తుందని పండితులు తెలిపారు.
